విడుద‌ల‌కు సిద్ద‌మైన హర్ష్‌ కనుమిల్లి, జ్ఞానసాగర్ ద్వార‌క‌, వర్గో పిక్చర్స్ 'సెహ‌రి'

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రోమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 Harsh Kanumilli Gnanasagar Dwaraka Vargo Pictures Sehari Movie Ready To Release-TeluguStop.com

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ 60 లక్షల వీక్షణలు పొందగా, “సెహరి టైటిల్ సాంగ్”, “ఇది చాలా బాగుందిలే” యూట్యూబ్ నందు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ముఖ్యంగా “ఇది చాలా బాగుందిలే” అనే పాట 80 లక్షల వీక్షణలు పొంది శరవేగంగా కోటి వీక్షణలకు దూసుకుపోతూ అతి త్వ‌ర‌లో విడుద‌ల‌కాబోతున్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకులలో అంచనాలను పెంచింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి మాట్లాడుతూ – `సెహ‌రి టీజర్ మరియు పాటల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ముఖ్యంగా హీరో హర్ష్ కనుమిల్లి నటన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది.

అంతే కాకుండా ఎక్కడ కూడా మొదటి సారిగా నటించినట్టుగా కాక ఎంతో అనుభవంతో నటిస్తున్నట్టుగా చాలా అధ్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించబడిన “సెహరి” సినిమా కుటుంబ సమేతంగా వెళ్ళి హాయిగా నవ్వుకుని ఆనందించదగ్గ సినిమా అవుతుంది” అని చిత్ర విజయం పట్ల నిర్మాత ఆద్వయ జిష్ణు రెడ్డి దీమా వ్యక్తం చేశారు.

Telugu Dwaraka, Gnanasagar, Harsh Kanumilli, Adayyajishnu, Ready, Sehari, Tollyw

దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ – “ఈ చిత్రంలోని కథ మరియు పాత్రలు అన్నీ యువత మరియు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాం” అన్నారు.

నటీనటులు:

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి, అభినవ్‌ గోమఠం, ప్రణీత్‌ రెడ్డి, కోటి, బాలకృష్ణ

సాంకేతిక విభాగం

దర్శకుడు: జ్ఞానసాగర్‌ ద్వారక ప్రొడ్యూసర్స్‌: అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి డీఓపీ: అరవింద్‌ విశ్వనాథ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రశాంత్‌ ఆర్ విహారి ఎడిటర్‌: రవితేజ గిరిజాల ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్‌

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube