అఫిషియల్ : హరీష్ శంకర్ తో మాస్ రాజా.. ఈసారి పీరియాడికల్ మూవీ అట!

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) స్పీడ్ ను ఏ హీరో కూడా తట్టుకోలేడు.ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంటాడు.

 Harish Shankar To Make A Period Drama With Ravi Teja Details, Harish Shankar, Ra-TeluguStop.com

ఇక రవితేజ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కెరీర్ లోనే మంచి ఫామ్ లో ఉన్నాడు.

ఈయన ప్రజెంట్ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రవితేజ తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు.

ఏప్రిల్ 7న ఈయన నటించిన ‘రావణాసుర’ సినిమా రిలీజ్ కాబోతుంది.మరోవైపు పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు.ఇదిలా ఉండగా ఇప్పుడు రవితేజ మరో మూవీకి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.

Telugu Hairsh Shankar, Harish Shankar, Mirapakay, Pawan Kalyan, Ravanasura, Ravi

మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar).మరి ఈ డైరెక్టర్ తో మాస్ రాజా ఇప్పటికే మిరపకాయ్ వంటి సినిమాను చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.మరి ఈ కాంబోలో మరో మూవీ రాబోతుంది అని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించిన రవితేజను ఒక అభిమాని హరీష్ శంకర్ తో మరో మూవీ ఎప్పుడు చేస్తారు అని అడుగగా ఈ ప్రశ్నను హరీష్ కు ట్యాగ్ చేసాడు మాస్ రాజా.

Telugu Hairsh Shankar, Harish Shankar, Mirapakay, Pawan Kalyan, Ravanasura, Ravi

మరి ఇందుకు సమాధానంగా ఆయన తామిద్దరి కాంబోలో ఒక భారీ పెరియాడికల్ మూవీ రాబోతుంది అని అందుకు వర్క్ కూడా జరుగుతుందని.త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు.దీంతో ఈ కాంబో కోరుకునే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక ప్రజెంట్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇది పూర్తయితే కానీ వీరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube