Vetrimaaran : సినిమా హిట్టవ్వడంతో ఫ్లాట్స్ గిఫ్ట్ గా ఇచ్చిన డైరెక్టర్.. మరీ ఈ రేంజ్ షో అవసరమా?

మామూలుగా ఒక సినిమా హిట్ అయితే అందులో దర్శకుడు హీరో నటీనటుల పాత్ర ఎంత ఉంటుందో మనకు కనిపించని తెర వెనుక కష్టపడే టెక్నీషియన్లు పాత్ర కూడా అంతే ఉంటుందని చెప్పవచ్చు.అయితే చాలా తక్కువ దర్శకులు మాత్రమే టెక్నీషియన్ లను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు వారి కష్టాన్ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు.

 Tamil Director Vetri Maran Gifted Flats To The Assistant Directors-TeluguStop.com

అటువంటి వారిలో తెలుగులో మన దర్శకుడు తేజ ఒకరు.అలాగే తప్పుగా దర్శకుడు వెట్రిమారన్ కూడా ఈ కోవకే చెందుతారని చెప్పవచ్చు.

జయం సినిమా సమయంలో డైరెక్టర్ తేజ తన సినిమా కోసం పనిచేసినవారికి అపార్ట్మెంట్ లో ప్లాట్ లు కొని ఇచ్చారు.

Telugu Gift Flats, Kollywood, Soori, Vetri Maran, Viduthalai-Movie

అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఇప్పుడు తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ ( Vetrimaaran )కూడా ఇదే పనిచేశాడు.డైరెక్టర్ వెట్రిమారన్ తన దగ్గర పని చేసేవారికి అవసరమైన అన్ని సౌకర్యాలతో పాటు వారి బాగోగులు కూడా చూసుకుంటూ ఉంటారు వెంట్రిమారన్.

అవసరమైతే పర్సనల్ గా సహాయం చేయడానికి కూడా వెనుకడుగు వేయరు.అలాంటి దర్శకుల్లో వెట్రి మారన్ స్టైలే వేరని చెప్పవచ్చు.తన అసిస్టెంట్ డైరెక్టర్లను( Assistant directors ) చాలా బాగా చూసుకోవడమే కాకుండా ప్రతీ సినిమాకు వారికి ప్రత్యేకంగా బహుమతులు కూడా ఇస్తుంటాడు.ఇక సినిమా హిట్ అయితే సర్ ప్రైజ్ లు ఇవ్వడం కూడా ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.

Telugu Gift Flats, Kollywood, Soori, Vetri Maran, Viduthalai-Movie

ఈ క్రమంలోనే వెట్రిమారన్ తాజాగా తమిళ కమెడియన్ సూరిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా విడుతలై( Viduthalai ) ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ మూవీ మార్చ్ 31 న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.దాంతో చిత్ర బృందం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సందర్బంగా దర్శఖుడు వెట్రిమారన్ తన అసిస్టెంట్స్ అందరికి ప్లాట్లు గిఫ్ట్ గా ఇచ్చాడట.ఈ మూవీ సక్సెస్ కి కారణం అయిన 25 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు వెట్రి మాన్ తలా ఒక ఫ్లాట్ కొనిచ్చారట.

అంతేకాదు మూవీ టీమ్ మొత్తానికి ఆయన బంగారు నాణేన్ని బహుమతిగా ఇచ్చారట.ఈ విషయం ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube