జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి హరిరామ జోగయ్య మరోసారి ఫైర్ అయ్యారు.జనసేన పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల గురించి క్లారిటీ రావడంతో హరిరామ జోగయ్య ఆదివారం రోజున పవన్ కు లేఖ రాయగా ఆ లేఖ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అంటూ పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా? అని ఆయన కామెంట్లు చేశారు.జనసేన( Janasena )కు 24 సీట్లకు మించి గెలవగల సత్తా లేదా అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు.
టీడీపీ జనసేన సీట్ల పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా అంటూ ఆయన ప్రశ్నించారు.బలమైన అభ్యర్థుల ఆధారంగా 24 నియోజకవర్గాలను ఎంపిక చేయడం జరిగిందని పవన్ చంద్రబాబుకు వంత పాడటం ఎందుకో వంత పట్టడం లేదని హరిరామ జోగయ్య అన్నారు.
జనసైనికుల శక్తిని పవన్ ఎందుకు అంత తక్కువగా అంచనా వేసుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
24 నియోజకవర్గాల కేటాయింపు జనసైనికులను సంతృప్తిపరచదని ఆయన చెప్పుకొచ్చారు.పవన్ ను 2.5 సంవత్సరాల పాటు సీఎంగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారని జనసేనకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరగడం ద్వారా అధికారం దక్కదేమో అని జనసైనికులు ఆవేదన చెందుతున్నారని హరిరామ జోగయ్య కామెంట్లు చేశారు.జనసైనికులను సంతృప్తి పరచకుండా వైసీపీని ఎలా ఓడించగలుగుతామని ఆయన అన్నారు.
పవన్ లేకుండా నీతివంతమైన పాలన సాగదని వారి ఆందోళన అని హరిరామ జోగయ్య( Harirama Jogaiah ) వెల్లడించారు.టీడీపీ జనసేనలకు చెరిసగం మంత్రి పదవులు దక్కాలని ఈ ప్రకటన చంద్రబాబు నుంచి రావాలని హరిరామ జోగయ్య కామెంట్లు చేశారు.హరిరామ జోగయ్య ప్రశ్నలకు పవన్ లేదా జనసైనికుల నుంచి జవాబు దొరుకుతుందేమో చూడాలి.
జనసేన పోటీ చేసే నియోజకవర్గాల గురించి త్వరలో మరింత క్లారిటీ రానుంది.