రోజుకు 60 లీటర్ల పాలు ఇచ్చే ఆవు ఇది.. దీనిని ఎలా పెంచాలంటే..

ఈ ఆవును పెంచడం ద్వారా, మీరు కొద్ది రోజుల్లో ధనవంతులు అవుతారు.ఈ ఆవు రోజుకు 60 లీటర్ల వరకు పాలు ఇస్తుంది.

 Hardhenu Cow Gives Milk From 55 To 60 Liters Every Day ,luvas , Hardhenu Cow ,-TeluguStop.com

పశుపోషణ వ్యాపారంలో నిమగ్నమైన చాలా మంది రైతులు, ఆ పాడి ఆవును కొనుగోలు చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడిపోతున్నారు.ఇతర జాతుల కంటే ఎక్కువ పాలను ఇచ్చే ఆవు జాతి గురించిన‌ సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఆవును పెంచ‌డం వ‌ల‌న పశువుల యజమానుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంద‌.గత కొన్నేళ్లుగా హర్ధేను ఆవును పెంచాల‌ని నిపుణులు రైతులకు సలహా ఇస్తున్నారు.

ఈ ఆవు ప్రత్యేకత ఏమిటంటే.ఇది రోజుకు 50-55 లీటర్ల పాలను ఇస్తుంది.

దీనిని హర్యానాలోని లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ (లువాస్) శాస్త్రవేత్తలు మూడు జాతులను కలిపి తయారు చేశారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ హర్ధేను జాతిని నార్త్-అమెరికన్ (హోల్‌స్టెయిన్ ఫ్రిజ్న్), స్వదేశీ హర్యానా, సాహివాల్ జాతికి చెందిన క్రాస్ బ్రీడ్ నుండి ప్రత్యేకంగా తయారు చేశారు.

హర్ధేను ఆవు గురించి చెప్పాలంటే, ఈ జాతికి పాల సామర్థ్యం ఇతర జాతుల ఆవుల కంటే ఎక్కువ.దీని పాల రంగు ఇతర ఆవుల కంటే మ‌రింత తెల్లగా ఉంటుంది.

ఇతర ఆవులు సగటున 5-6 లీటర్ల పాలు ఇస్తే, హర్ధేను ఆవు సామర్థ్యం రోజుకు సగటున 15-16 లీటర్ల పాలు ఇస్తుంది.మేత విష‌యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాని పాల సామర్థ్యం 55-60 లీటర్లకు చేరుకుంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube