హనుమాన్ సినిమా( Hanuman Movie ) సంక్రాంతి బరిలో దిగి స్టార్ హీరోలకు సైతం దీటుగా వసూళ్ల సునామి సృష్టిస్తుంది.మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంతో, నాగార్జున నా సామి రంగా అలాగే వెంకటేష్ సైంధవ సినిమాలకు పోటీగా చిన్న హీరో ఆయన తేజ తో ప్రశాంత వర్మ( Director Prashanth Varma ) దర్శకత్వంలో హనుమాన్ చిత్రం తెరకెక్కింది.
అయితే ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ గురించి చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.చాలామంది వందల వేల కోట్లు పెట్టి సినిమాలు తీసిన గ్రాఫిక్స్ చాలా చండాలంగా ఉన్నాయి అని టాక్ వస్తున్న ఈ టైంలో అతి తక్కువ బడ్జెట్ తో ఎక్కిన హనుమాన్ చిత్రం అద్భుతమైన రికార్డులను సృష్టించే దిశగా దూసుకు వెళ్తుంది.
హనుమాన్ సినిమాకి టోటల్ బడ్జెట్ కేవలం 50 కోట్లు అని తెలిసిన వెంటనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ నోరెళ్ళ బెట్టారు.ఇంత తక్కువ బడ్జెట్ తో చాలా క్వాలిటీగా హనుమాన్ చిత్రం వచ్చింది అని అందరూ పొగుడుతున్నారు అయితే ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం కూడా ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇక చిన్న నటుడు మరియు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసి హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న తేజ( Teja Sajja ) ఈ చిత్రం కోసం రెండు కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకున్నాడు.
ఇక హీరోయిన్ గా నటించిన అమృత అయ్యర్( Amritha Aiyer ) ఈ సినిమా కోసం దాదాపు 1.5 కోట్ల రూపాయలను వారితోషకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది.అలాగే హీరోకి అక్క పాత్రలో నటించడం వరలక్ష్మి( Varalakshmi Sarathkumar ) కోటి రూపాయల వరకు పారితోషకం తీసుకున్నారట.
హనుమాన్ చిత్రంలో విలన్ గా అలరించిన వినయ్( Vinay ) ఇంతకు ముందే వాన అనే సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత అనేక సినిమాల్లో ముఖ్యమైన పాత్రలో అలాగే తన విలనీ తో కూడా ఆకట్టుకుంటున్నాడు కానీ ఇతడు తీసుకున్న పారితోషకం కేవలం 65 లక్షలు మాత్రమే.
ఇక కమెడియన్స్ గా అలరించిన వెన్నెల కిషోర్ 55 లక్షలు తీసుకోగా గెటప్ శీను 35 లక్షలు, ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ దీపక్ శెట్టి 85 లక్షలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.