టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన హన్సిక( Hansika ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హన్సిక ప్రస్తుతం తెలుగు కంటే తమిళ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండగా ఆమెకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
తాజాగా హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 16 ఏళ్లకే తాను హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకున్నట్టు జరిగిన ప్రచారం గురించి ఫైర్ అయ్యారు.మై నేమ్ ఈజ్ శృతి మూవీ( My Name Is Shruthi ) ప్రమోషన్స్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఈ వ్యాఖ్యల గురించి హన్సిక తల్లి వివరణ ఇచ్చినా ఆ ప్రచారం మాత్రం ఇప్పటికీ ఆగలేదు.వైరల్ అయిన వార్తలు అమ్మను బాధ పెట్టిన స్థాయిలో నన్ను బాధ పెట్టలేదని హన్సిక తెలిపారు.ఎందుకంటే వైరల్ అయిన వార్తలన్నీ తప్పుడు ప్రచారమే అని హన్సిక చెప్పుకొచ్చారు.నాపై వచ్చిన రూమర్లు అమ్మను బాధ పెట్టడంతో అమ్మ పరిస్థితిని చూసి మేము ఏడ్చామని హన్సిక కామెంట్లు చేశారు.
ఇలాంటి వార్తలను నా ఫ్యామిలీ మెంబర్స్ గతంలో ఎప్పుడూ వినలేదని వైరల్ అయిన పుకార్లు నీ జీవితాన్ని విచ్ఛిన్నం చేశాయని ఆమె అన్నారు.సోషల్ మీడియాలో( Social media ) ఎవరికైనా ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఉందని అలా అని ఒకరి వ్యక్తిగత జీవితం గురించి ఎలా పడితే అలా రాయమని చెప్పలేదు కదా అంటూ హన్సిక అభిప్రాయపడ్డారు.హన్సిక చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.హన్సిక ఘాటుగా స్పందించిన నేపథ్యంలో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.హన్సిక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.హన్సిక రెమ్యునరేషన్( Hansika Remuneration ) ప్రస్తుతం పరిమితంగానే ఉంది.
హన్సిక రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.