విదేశీ వృత్తి నిపుణులను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కలిగించే హెచ్ 1 బీ వీసా( H1B Visa ) ప్రక్రియకు సంబంధించి మోసాలకు చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం కీలక నిర్ణయాలు తీసుకుంది.ఇకపై దరఖాస్తుదారు బహుళ దరఖాస్తులు చేసుకున్నా.
ఒకే అప్లికేషన్‌గా పరిగణించనున్నారు.రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా.దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రక్రియకు నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది.
2025 ఆర్ధిక సంవత్సరానికి గాను మొదలయ్యే వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ నిబంధనలను అమలు చేయాలని యూఎస్‌సీఐఎస్( USCIS ) వెల్లడించింది.ఈ క్రమంలో లబ్ధిదారుడు సరైన పాస్‌పోర్ట్( Valid Passport ) వివరాలు, ప్రయాణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి వుంటుంది.హెచ్ 1 బీ వీసాల కోసం మొదటి రిజిస్ట్రేషన్ పీరియడ్ మార్చి 6 నుంచి మార్చి 22 వరకు కొనసాగనుంది.
ఫాం ఐ 129, నాన్ క్యాప్ హెచ్ 1 బీ పిటిషన్ల కోసం ఫాం ఐ 907లను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాల్సి వుంటుంది.
కాగా.హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.ఏటా హెచ్-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.
వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా( America Visa ) జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు( Foreign Students ) మరో 20వేల వీసాలు ఇస్తారు.
అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.
అలాగే 2025 ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ వీసా దరఖాస్తులకు గాను ఆన్‌లైన్ అప్లికేషన్ ఫైలింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని యూఎస్‌సీఐఎస్ ప్రకటించింది.సంస్థ ఖాతాలు, సంస్థ లేదా ఇతర వ్యాపార సంస్థతో సహా సంస్థలోని వ్యక్తులు వారి న్యాయ సలహాదారులను హెచ్ 1 రిజిస్ట్రేషన్లు, ఫారం ఐ 129 (ఇమ్మిగ్రెంట్ వర్కర్ కోసం పిటిషన్), అనుబంధ ఫాంల తయారీలో సహకరించడానికి అనుమతిస్తాయని యూఎస్‌సీఐఎస్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.