బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు ( Guppedantha Manasu ) సీరియల్ ఎంతో మంచి ఆదరణ పొందింది.ఈ సీరియల్ లో రిషి ( Rishi ) పాత్రకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
అలాగే జగతి( Jagathi ) పాత్రలో నటించిన జ్యోతి రాయ్ ( Jyothi Rai ) పాత్రకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.ఈ సీరియల్ లో వీరిద్దరూ తల్లి కొడుకులుగా కనిపిస్తారు.
ఇలా ఈ సీరియల్ ద్వారా వీరిద్దరూ తెలుగులో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ముఖ్యంగా జగతి పాత్రలో నటించిన జ్యోతి ఈ సీరియల్ లో చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తారు.
సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే జ్యోతి తన కట్టుబొట్టుతోనే అందరిని ఆకట్టుకున్నారు.అయితే ఈమె సీరియల్ లో మాత్రమే ఇలాగ ఉంటుంది వ్యక్తిగతంగా మాత్రం పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి.గ్లామర్ షో చేసే విషయంలో హీరోయిన్స్ కూడా ఈమె ముందు ఏమాత్రం పనికిరారని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.అదేవిధంగా ఈమె మరొక డైరెక్టర్ తో కూడా రిలేషన్ లో ఉండడంతో ఈమె పట్ల భారీగానే ట్రోల్స్ జరుగుతూ వస్తున్నాయి.
ఇదిలా ఉండగా నటి జ్యోతి రాయ్ గ్లామరస్ ఫోటోలపై రిషి పాత్రలో నటించిన నటుడు ముఖేష్ గౌడ్( Mukesh Gowd ) స్పందించారు ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ… ఆమె సీరియల్లో ఎలాంటి పాత్రలో నటిస్తుందో తన వ్యక్తిగత జీవితంలో కూడా అలాగే ఉండాలని రూల్ ఎక్కడా లేదు తన వ్యక్తిగత జీవితం తన ఇష్టం అని తెలిపారు.అదేవిధంగా ఆమెలో కూడా హీరోయిన్ లక్షణాలు దాగి ఉన్నాయేమో ఎవరికి తెలుసు అంటూ తన గ్లామరస్ ఫోటోలపై ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.