టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో, డైరెక్టర్ కాంబినేషన్లు రిపీట్ కావడం కామన్.ఒక హీరో, ఒక డైరెక్టర్ కలిసి తీసిన ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయిందంటే వారి కాంబోలో మరొక మూవీ తెరకెక్కడం సర్వసాధారణం.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.రాజమౌళి, తారక్ కాంబోలు కూడా రిపీట్ అయ్యాయి.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్స్ కూడా పునరావృతమయ్యాయి.తొలి సినిమాతో ఒక హీరో, ఒక డైరెక్టర్ హిట్ కొట్టారంటే నెక్స్ట్ సినిమాతో అంతకుమించిన హిట్ కొట్టాలని వారిద్దరూ అనుకుంటారు.
రిపీటెడ్ కాంబోళ్లపై హైప్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది.

అలాంటి హైప్‌తో వచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) సినిమా ఒకటి అట్టర్ ఫ్లాప్ అయ్యింది.మహేష్ బాబు, గుణశేఖర్ కాంబోలో మొదటగా “ఒక్కడు (2003)” సినిమా వచ్చింది.ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
దీని తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో 2004లో “అర్జున్” సినిమా వచ్చింది.ఈ మూవీ బిలో యావరేజ్ గా ఆడింది.
మధుర మీనాక్షి టెంపుల్ బ్యాక్ డ్రాప్ తో అర్జున్ సినిమా( Arjun Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ అది ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా ఆడక పోవడంతో మహేష్ బాబు బాగా డిసప్పాయింట్ అయ్యాడు.
తర్వాత పూరీ జగన్నాథ్ తో కలిసి “పోకిరి”( Pokiri ) సినిమా తీసి మహేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.అనంతరం మళ్లీ గుణశేఖర్ మహేష్ తో సినిమా చేయడానికి కథ రెడీ చేసుకున్నాడు.
ఈసారి మంచి హిట్ కొడదామని చెబుతూ మహేష్ ను హీరోగా పెట్టి “సైనికుడు” సినిమా తీశాడు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
దాంతో మహేష్ తీవ్ర నిరాశలో మునిగిపోయాడట.పోకిరి విజయం తర్వాత ఎంత సంతోషించాడో సైనికుడు( Sainikudu ) ఫ్లాప్ తర్వాత మహేష్ అంత బాధపడ్డాడట.
చాలా రోజుల వరకు గుణ శేఖర్ తో మాట్లాడలేదట.

అయితే గుణశేఖర్( Gunasekhar ) సైనికుడు ఫ్లాప్ అయిన తర్వాత కూడా మహేష్ బాబును సంప్రదించడానికి చాలా ప్రయత్నించాడట కానీ మహేష్ సున్నితంగా అతనితో మాట్లాడడానికి నిరాకరించాడట.గుణ శేఖర్ కొన్ని సినిమా కథలను కూడా రెడీ చేసుకుని మహేష్ కి వినిపించాలని కోరుకున్నాడట.కానీ మహేష్ మాత్రం మళ్లీ అతడిని నమ్మి సినిమా చేయాలనుకోలేదు.
ఇప్పటికీ గుణశేఖర్ కథ వినిపిస్తానంటే మహేష్ ఆమడ దూరం పారిపోతాడని సినీ వర్గాల్లో టాక్.ఏదేమైనా గుణశేఖర్ తనకు ఇచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే బాగుండేది.
ఏ హీరో కూడా రెండుసార్లు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో మరో సినిమా చేయడానికి ధైర్యం చేయడు.అందుకు మహేష్ మినహాయింపు ఏమీ కాదు.