ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే వేడి పానీయాలలో టీ( Tea )ఒకటి.ఇండియాలో కూడా టీ అధికంగా తాగుతుంటారు.
ఒక్కొక్కరి అభిరుచికి తగినట్లుగా ఆల్రెడీ ఇప్పటికే చాలా రకాల టీలు అందుబాటులోకి వచ్చాయి.ప్రజలు ఉదయాన్నే లేదా పని వేలల్లో టీ తాగుతూ ఉత్సాహాన్ని తెచ్చుకుంటున్నారు.
సాధారణంగా టీ పోసుకోవడానికి వంద రూపాయలు లోపు విలువైన కప్పు కొనుగోలు చేస్తారు.దానికి తోడు వంద రూపాయలు విలువైన సాసర్ కూడా కొంటారు.ఇక ఈ టీపాట్ కోసం మహా అంటే రూ.1,000 ఖర్చు చేస్తారు కానీ ది ఇగోయిస్ట్ అనే టీపాట్ మాత్రం ఏకంగా 24 కోట్ల రూపాయలు పలుకుతూ అందరినీ షాక్‌కి గురి చేస్తోంది.
ఇంత ధర ఎందుకంటే ఆ పాట్ నిండా 1658 డైమండ్స్ పొదిగారు.అంతేకాదు దీని తయారీలో 18 క్యారెట్ల గోల్డ్, గోల్డ్ పూతతో కూడిన వెండిని ఉపయోగించారు.
శిలాజ మముత్ ఐవరీ( Mammoth Ivory )నుంచి హ్యాండిల్‌ను తయారు చేశారు.ఈ టీపాట్ మూతపై థాయిలాండ్, బర్మా దేశాల నుంచి ప్రత్యేకంగా సేకరించిన 386 కెంపులు లేదా రూబీలు జోడించారు.
మొత్తంగా ఈ టీపాట్ చూసేందుకు అద్భుతంగా ఉంటుంది.