గిన్నీస్ ప్రపంచ రికార్డులు అనేవి ప్రతి సంవత్సరం ప్రచురించబడే ఒక ప్రమాణిక పుస్తకంగా చెప్పుకోవచ్చు.అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను ఇందులో నమోదు చేస్తారు.
మనుషులు సాధించిన ఘనవిజయాలు, ప్రకృతిలో జరిగే విపరీతాలను గుర్తించి ఇందులో పొందుపరుస్తారు.ఈ పుస్తకం కాపీరైటు పొందిన పుస్తకాల అమ్మకాలలో ప్రపంచ రికార్డు సాధించింది.
ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఘటనలు, విశేషాలు ఇందులో పొందుపరచబడ్డాయి.
తాజాగా ఓ వ్యక్తి ఒక్క నిమిషంలో 55 కొవ్వొత్తులను ఆర్పివేసి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు.ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి పరిశీలిస్తే, కింద వరుసగా కొవ్వొత్తులు అమర్చబడి ఉండడం గమనించవచ్చు.తరువాత ఓ వ్యక్తి వాటి మీదుగా జంప్ చేస్తూ తన 2 పాదాలను తాకిస్తూ వస్తున్న గాలితో కొవ్వొత్తులను ఆర్పివేస్తున్నాడు.
ఈ క్రమంలో ట్యూడర్ ఫిలిప్స్ అనే వ్యక్తి ఒక్క నిమిషంలో అత్యధిక కొవ్వొత్తులను ఆర్పేశాడు.UKలోని స్వాన్సీ నేషనల్ వాటర్ ఫ్రంట్ మ్యూజియంలో ట్యూడర్ ఫిలిప్స్ ఈ ఘనతను సాధించాడు.
దాంతో తాజాగా దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయగా పోస్ట్ చేసిన కొద్ది సేపటికే బాగా వైరల్ అయింది.లక్షలాది మంది దీన్ని వీక్షించడం విశేషం.ఇటువంటి రికార్డును తాను మొదటిసారి చూస్తున్నానని, ఇది నిజంగా సూపర్ అని, నేను కూడా ట్రై చేస్తానని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.అయితే కొంతమంది మిశ్రమంగా స్పందిస్తున్నారు.
చాలా కొత్తగా ప్రయత్నించారు కానీ, దీని వల్ల ఉపయోగం ఏమిటి? అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా ఈ రికార్డును మరొకరు ఖచ్చితంగా బద్దలు కొడతారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.అయితే ఈ రికార్డు కోసం ఆ వ్యక్తి దాదాపు ఏడాది పాటు శ్రమించినట్టు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.