ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంతటి ఉత్పాతాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే.కోట్ల సంఖ్యలో కరోనా కేసులు, లక్షల సంఖ్యలో మరణాలతో అన్ని దేశాలు అల్లాదిపోయాయి.
విదేశాలలో ఉండే ప్రవాసులు ఉన్నపళంగా వారి వారి సొంత ప్రాంతాలకు తరలిపోయారు.అయితే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతోంది.
థర్డ్ వేవ్ వ్యాప్తి పెద్దగా లేకపోవడంతో అన్ని దేశాలు తమ దేశంలోకి ఎంట్రీ ఇచ్చే వలస వాసుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.అందులో భాగంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవడంతో పాటు, క్వారంటైన్ నిభంధనలు కూడా విధించింది.
దాంతో ఎంతో మంది ప్రవాసులు ఈ నిభంధనలతో విసిగిపోయారు.
అయితే అబుదాబి ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
అబుదాబి వచ్చే విదేశీయులు ఎవరైతే ఉంటారో వారు రెండు వ్యాక్సినేషన్లు వేసుకుంటే అబుదాబి వచ్చిన తరువాత ఇక్కడ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది.గతంలో అబుదాబి విధించిన క్వారంటైన్ నిభందనల ప్రకారం విదేశాల నుంచీ వచ్చే వారు దాదాపు 10 రోజుల పాటు అక్కడి క్వారంటైన్ లో ఉండాలని తరువాత తుది పరీక్షలు చేసిన తరువాత మాత్రమే తమ దేశంలోకి అనుమతి ఇస్తామని ప్రకటించింది.
అయితే ఈ 10 రోజుల ఖర్చు సైతం ప్రవాసులే భరించాలని కూడా తెలిపింది.
కానీ తాజా నిభంధనల ప్రకారం ప్రవాసులు ఎవరైనా సరే రెండు సార్లు వ్యాక్సిన్ లు వేసుకోవాలి అలాంటి వారిని తమ దేశంలోకి అనుమతి ఇస్తామని అలాగే వారు క్వారంటైన్ లలో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
అయితే గ్రీన్ లిస్టు లో ఉన్న వారు మాత్రమే ఇందుకు అర్హులుగా పేర్కొనడంతో భారతీయులకు నిరాశ ఎదురయ్యింది.అబుదాబి ప్రకటించిన గ్రీన్ లిస్టు దేశాలలో భారత్ లేకపోవడమే అందుకు కారణం.
ఇదిలాఉంటే గ్రీన్ లిస్టు లో లేని దేశాల వారు తప్పకుండా క్వారంటైన్ నిభందనలు పాటించాలని, వచ్చిన 4 రోజుల నుంచీ 8 రోజుల్లో పీసిఆర్ టెస్ట్ చేయించుకోవాలని ప్రకటించింది.భారత్ తో పాటు దాదాపు 55 దేశాలకు గ్రీన్ లిస్టు లో చోటు దక్కక పోవడం గమనార్హం.