తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో రెండో ర్యాంక్.. గరిమా సక్సెస్ స్టోరీకి గ్రేట్ అనాల్సిందే!

యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్( Civil Services ) పరీక్షలలో సత్తా చాటాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు సంబంధించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

 Garima Lohiya Success Story Details Here Goes Viral In Social Media , Garima Loh-TeluguStop.com

ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో ఆలిండియా రెండో ర్యాంక్ ను గరిమా లోహియా ( Garima Lohia )సొంతం చేసుకున్నారు.బీహార్ లోని బక్సర్( Buxar in Bihar ) ప్రాంతానికి చెందిన గరిమ లోహియా కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం కోసం ఎంతో కష్టపడ్డారు.

గరిమా లోహియా తండ్రి పేరు మనోజ్ కుమార్ లోహియా( Manoj Kumar Lohia ) కాగా తల్లి పేరు సునీత.గరిమ చిన్నప్పటి నుంచి ఆటల్లో, చదువులో ముందువరసలో ఉండేవారు.

బక్సర్ లోని వుడ్ స్టాక్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన గరిమా లోహియా యూపీలో ఇంటర్ పూర్తి చేశారు.పదిలో 10కి 10 జీపీఏ సాధించిన గరిమా చదువు విషయంలో వెనక్కు తిరిగి చూసుకోలేదు.2015 సంవత్సరంలో గరిమా తండ్రి మనోజ్ గుండెపోటుతో మరణించారు.

తండ్రి మరణం వల్ల గరిమా లోహియాకు కొన్ని ఇబ్బందులు ఎదురవడం ఎదురయ్యాయి.ఇంటర్ లో 98.2 శాతం మార్కులు సాధించిన గరిమా బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.చదువు పూర్తైన తర్వాత గరిమా లోహియా సివిల్స్ లక్ష్యాన్ని ఎంచుకున్నారు.ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈ లక్ష్యాన్ని ఎంచుకున్న గరిమా లోహియా 2021లో మొదటిసారి పరీక్ష రాయగా ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయ్యారు.

2022లో రెండో ప్రయత్నంలో గరిమా లోహియా సెకండ్ ర్యాంక్ సాధించడం గమనార్హం.సివిల్స్ లో ఆమెకు వచ్చిన మార్కులు 1063 కావడం గమనార్హం.పరీక్షల ఫలితాల్లో సెకండ్ ర్యాంక్ రావడంతో గరిమా లోహియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.గరిమా లోహియా సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube