సాధారణంగా అబ్బాయి వయసు ఎక్కువ, అమ్మాయి వయసు తక్కువ .ఇలాంటి జంటల్నే చూస్తుంటాం.
కాని తమ కన్నా పెద్ద వయసున్న అమ్మాయిల్ని చాలామంది మగవారు పెళ్ళి చేసుకుంటారు.సచిన్ టెండుల్కర్, మహేష్ బాబు, అభిషేక్ బచ్చన్ లాంటి పెద్ద పెద్ద పేర్లే ఇందుకు ఉదాహారణ.
అలాగే మరీ ముసలావిడని పెళ్ళి చేసుకునే పురుషులు లేకపోలేదు.యూరప్, అమెరికన్ దేశాల్లో ఇది చాలా సాధారణమైన విషయం.
టీనేజ్ కుర్రాడు కూడా ముసలావిడతో డేటింగ్ చేస్తుంటాడు.కాని ఈ వార్త సాధారమైనది కాదు.
బాహుబలిలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు.
ప్రస్తుతం ఫ్రాన్స్ లో అధ్యక్ష పోటిలు జరుగుతున్నాయి.
పోటిలో ఉన్న ఎమ్మానుయేల్ మాక్రాన్ ఫస్ట్ రౌండు ఇప్పటికే గెలుచుకున్నాడు.తదుపరి ప్రెసిడెంటు తనే అని ఫిక్స్ అయిపోవచ్చు.
కాని ఎమ్మానుయేల్ గెలుపు కాదు ఇప్పుడు పెద్ద వార్త.అతని పెళ్ళి ఓ పెద్ద వార్త.
ఎలా అంటే …
ఇతగాడు స్కూలులో ఉన్నప్పుడు తన క్లాస్ టీచర్ బ్రిగెట్టి వయసు 24-25.ఆమె కూతురు ఇతగాడి క్లాస్ మేట్.
మనకి ఊహ ప్రకారమైతే ఓ వయసొచ్చాక ఎమ్మానుయేల్ తన టీచర్ కూతురితో ప్రేమలో పడాలి.ఇద్దరు చట్టాపట్టాలేసుకోని తిరిగితే ఆ టీచర్ చివాట్లు పెట్టాలి.
మీరే కాదు, ఎమ్మానుయేల్ తల్లిందండ్రులు కూడా ఇదే జరుగుతోంది అని అనుకున్నారట.అంటే టీచర్ కూతురితో మనోడు ప్రేమలో పడ్డట్లు అంచనా వేసారట.
కాని అక్కడ జరిగింది అది కాదు.అతను ప్రేమలో పడ్డది తనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్ తోనే.
అవును, తనకి 15 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆమె మీద ప్రేమ పుట్టిందట.అప్పటికి ఆమె వయసు 39.ముగ్గురు పిల్లలు ఉన్నారు.
17 ఏళ్ళ వయసు రాగానే నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని అప్పటికి 42 ఏళ్ళు ఉన్న తన టీచర్ బ్రిగెట్టితో అన్నాడట.కట్ చేస్తే ఇప్పుడు ఎమ్మానుయేల్ వయసు 30, ఆ టీచర్ వయసు 55.అది 2007 సంవత్సరం.మన హీరో పెద్ద ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా ఎదిగి తను ప్రేమించిన టీచర్ నే పెళ్ళీ చేసుకున్నాడు.ఆ తరువాత పెద్ద పొలిటిషీయన్ గా ఎదిగి ఇప్పుడు ఏకంగా దేశానికి రాష్ట్రపతి కాబోతన్నాడు.
ఇప్పుడు ఆమెకి ముగ్గురు పిల్లలకి కలిపి ఏడుగురు సంతానం.వీరిద్దరికి పెళ్ళి జరిగి 10 ఏళ్ళు గడిచాయి.
ఫ్రాన్స్ లో వంట బాగలేదని కూడా విడాకులు ఇచ్చే జనాలు ఉంటారు.అలాంటిది తన కన్నా వయసులో 25 సంవత్సరాలు పెద్దగా ఉన్న భార్యని వదలట్లేదు ఎమ్మానుయేల్.
డబ్బు సంపాదించాడు, పేరు, పరపతి సంపాదించాడు .అయినా తన ప్రేమ ఇంకా అలాగే చెక్కుచెదరకుండా ఉంది.ఇదీ .నిజమైన ప్రేమంటే.