గుడివాడలో రెండో రోజు మాజీ మంత్రి కొడాలి నాని గడపగడపకు మన ప్రభుత్వం..

కృష్ణాజిల్లా గుడివాడ: గుడివాడ 16వ వార్డులో రెండో రోజు కొనసాగుతున్న మాజీ మంత్రి కొడాలి నాని గడపగడపకు మన ప్రభుత్వం.ప్రభుత్వ శాఖల అధికారులు, వైసిపి నాయకులతో ఇంటింటికి తిరుగుతున్న కొడాలి నాని.

 Former Minister Kodali Nani Gadapa Gadapaku Mana Prabhutvam Campaign In Gudivada-TeluguStop.com

గడపగడపలో మటన్ దుకాణం వద్ద మటన్ కోట్టిన మాజీ మంత్రి కొడాలి నాని.కొడాలి నాని కామెంట్స్.చెత్త పన్ను తొలగించమని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలను ఖండించిన కొడాలి నాని.20% మంది ప్రజానీకం పన్ను చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయాన్ని పేర్ని నానితో కలిసి తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పా.

చంద్రబాబు అండ్ కోకు మానసిక వైద్యశాలను ఏర్పాటు చేయాలని సీఎంకు చెప్పాను.2024 ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి బ్యాచ్ మొత్తాన్ని మానసిక వైద్యశాలలో చేర్పిస్తాం.చెత్త పన్ను తొలగించమని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు, తన మాటలు వక్రీకరించిన ప్రముఖ దినపత్రిక పై కొడాలి నాని మండిపడ్డారు.

కృష్ణాజిల్లా గుడివాడ 16వ వార్డులో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు.ప్రభుత్వ శాఖల అధికారులు, వైసిపి నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ మాజీ మంత్రి కొడాలి నాని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గడపగడప మన ప్రభుత్వంలో చెత్త పన్ను చెల్లించలేకపోతున్నామన్న మహిళల ప్రశ్నలకు సమాధానం చెప్పిన తన మాటలను వక్రీకరించడాన్ని కొడాలి నాని ఖండించారు.20శాతం మంది ప్రజానీకం చెత్త పన్ను చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారనీ, ఈ విషయమే పేర్ని నానితో కలిసి తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని చెప్పినట్లు ఆయన అన్నారు.చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా దుష్ట చతుష్టయం చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube