ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. దీపావళి షాపోత్సవ్ పేరుతో భారీ డిస్కౌంట్లు..

వరుసగా వస్తున్న పండగలు ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు ఆనందాన్ని ఇస్తున్నాయి.ఎందుకంటే ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ( Flipkart, Amazon )వంటి దిగ్గజ సంస్థలు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

 Flipkart Bumperafar Huge Discounts In The Name Of Diwali Shopotsav, Flipkart Bum-TeluguStop.com

కళ్లు చెదిరే డిస్కౌంట్లు ఉండడంతో ప్రత్యేక మేళాలలో కస్టమర్లు తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.దసరా, దీపావళి పండగల సమయంలో ప్రత్యేక సీజన్ సేల్స్‌ను ఫ్లిప్ కార్ట్, అమెజాన్ అమలు చేస్తున్నాయి.

ఈ తరుణంలో ఫ్లిప్ కార్ట్ ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది.తాజాగా కొత్త దీపావళి సేల్ 2023ని ప్రకటించింది.ఇప్పటికే దసరా సమయంలో నిర్వహించిన పండగ సీజన్ సేల్‌లో మొదటి ఏడు రోజుల్లో 1.4 బిలియన్ కస్టమర్ సందర్శనలను ఫ్లిప్ కార్ట్ నమోదు చేసింది.భారీగా విక్రయాలు సాగాయి.మరోసారి ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో ప్రజల ముందుకు ఫ్లిప్ కార్ట్ వస్తోంది.

Telugu Amazon, Deepawali Sale, Diwali Utsav, Flipkart Bumper, Flipkart, Latest,

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్( Flipkart Big Diwali Sale ) నవంబర్ 2న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుంది.ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రజలు విస్తృత శ్రేణి టెక్ ఉత్పత్తులపై అధిక డిస్కౌంట్లను పొందవచ్చు.ఇందులో స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్టంగా 45 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం వరకు డిస్కౌంట్, ఎథ్నిక్ వేర్‌లపై 80 శాతం( ethnic wears ) వరకు డిస్కౌంట్, ల్యాప్‌టాప్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్ ఉన్నాయి.

Telugu Amazon, Deepawali Sale, Diwali Utsav, Flipkart Bumper, Flipkart, Latest,

ఈ సేల్ స్మార్ట్‌ఫోన్‌లు, టీవీ & ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది.వాటితో పాటు వివిధ బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి కూడా డిస్కౌంట్లు పొందొచ్చు. కొటక్ మహీంద్రా, ఎస్‌బీఐ క్రెడిట్ ( Kotak Mahindra, SBI Credit )కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది.అంతేకాకుండా, సేల్ సమయంలో కస్టమర్‌లు పేటీఎం, యూపీఐ, ఇతర వాలెట్ లావాదేవీల ద్వారా కూడా ఆఫర్లు పొందుతారు.ఈ వారం ప్రారంభంలో ముగిసిన పండుగ సీజన్ మొదటి వారంలో ఈ-కామర్స్ కంపెనీలు స్థూల విక్రయాల్లో 19 శాతం వృద్ధిని నమోదు చేసి దాదాపు రూ.47,000 కోట్లకు చేరుకున్నాయని ఒక నివేదిక తెలిపింది.మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక ప్రకారం, ఫ్లిప్‌కార్ట్, మైంత్రా మరియు షాప్సీలతో కూడిన ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ మొదటి వారంలో స్థూల మర్చండైజ్ వాల్యూ (జిఎమ్‌వి)లో దాదాపు 63 శాతం వాటాతో సేల్స్‌లో ముందుంది.దాదాపు రూ.29,610 వ్యాపారాన్ని జరిపినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube