వరంగల్ అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఫ్లెక్సీల రగడ రాజుకుంది.జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పార్టీ నేతలు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నరేందర్, మేయర్ సుధారాణి పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.అయితే డిప్యూటీ మేయర్ ఫ్లెక్సీలతో పాటు ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు.
మరోవైపు ఎంపీ రవిచంద్ర ఫ్లెక్సీలపై మరోవర్గం ఫ్లెక్సీలను కడుతుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు.దీంతో సొంత పార్టీ కార్యకర్తల్లో వివాదం చెలరేగింది.