ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు డిజిటల్ రంగంపై మొగ్గు చూపిస్తున్నారు.కుటుంభ సభ్యులతో గడిపే కాలం కంటే ఎలక్ట్రానిక్ వస్తువులతో గడిపే కాలమే ఎక్కువ అయిపోయింది.
అసలు ఫోన్ లేకుండా జీవించలేకపోతున్నారు.తెల్లారింది మొదలు నిద్ర పోయేవరకు ఆ ఫోన్ ను అంటిపెట్టుకుని ఉంటున్నారు .ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో గడిపి గడిపి ఇంట్లో కుటుంభ సభ్యులతో టైమ్ స్పెండ్ చేయడం తగ్గించేస్తున్నారు.ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఒక జైనమత స్వచ్ఛంద సంస్థ ఒక వినూత్న ఆలోచన చేసింది.
బంధాలు కనుమరుగయ్యి పోతున్న వేళ రక్త సంబంధీకుల మధ్య బంధాలను పెంచాలని ఒక పోటీని నిర్వహించాలని అనుకుంది.
ఈ మేరకు “డిజిటల్ ఫాస్టింగ్ అనే పేరుతో ఒక కాంపిటేషన్ నిర్వహించింది.
జైన మతం ప్రధాన విలువలను వ్యాప్తి చేయడానికి ఈ పోటీని అంకితం చేసినట్లు తెలుస్తుంది.ఈ కాంపిటేషన్ లో పాల్గొనే పోటీదారులు మొబైల్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి గాడ్జెట్‌లను అసలు ఉపయోగించకూడదు.
ఎందుకంటే డిజిటల్ సేవలను ఉపయోగించకుండా కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపరచడంతో పాటు, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును మెరుగుపరచడం, ఆన్‌లైన్ అంతరాయాలను తగ్గించి వారిలో ఏకాగ్రతను పెంచడమే ఈ డిజిటల్ ఫాస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం.ఈ పోటీలో ప్రపంచ దేశాలు వారు పాల్గొన్నారు.
తాజాగా ఈ పోటీలు ముగిసాయి.ముగిసిన ఈ పోటీలో గుజరాత్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు విజేతలుగా నిలిచారు.
జైన్ కమ్యూనిటీ నుంచి మొత్తం 2,000 మంది ఈ పోటీలో పాల్గొన్నారు.

అయితే వీరందరిలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు మొదటి ఐదుస్థానాల్లో విజేతలుగా నిలిచారు.విజేతలలో నలుగురు అహ్మదాబాద్ నుంచి పోటీచేయగా ఒకరు సూరత్ నుంచి పాల్గొన్నారు.వీరిలో ఒక విజేతకి కేవలం పది సంవత్సరాలు మాత్రమే.
అలాగే మరో విజేతకి 14 ఏళ్లు వయసు మాత్రమే.అతి పిన్న వయస్కుడైన ధైర్య పరిఖ్ (10) మొదటి స్థానంలో నిలిచాడు.
విజేతల్లో అతి పెద్ద వయస్కులైన మహేష్ షా(78) స్థానంలో నిలిచారు.ఈ ఇద్దరూ కూడా అహ్మదాబాద్ నివాసితులే.
ధైర్య పరిఖ్ కి అక్క అయిన నిష్ఖా పరిఖ్ 3వ స్థానంలో, హేటల్ షా 4వ స్థానంలో ఉండగా, రమేష్‌చంద్ర షా5వ స్థానంలో నిలిచారు.ఈ పోటీలో గెలిచినా విజేతలు అందరూ 50 రోజుల పాటు డిజిటల్ ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉన్నారు.
పోటీ మొత్తం కాల వ్యవధి 1,200 గంటల ఉండగా.విజేతలు 1,050 గంటలు పాటు అన్ని గాడ్జెట్‌ల నుంచి దూరంగా ఉండడం విశేషం అనే చెప్పాలి.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోటీలో ఇద్దరు చిన్నారులు గెలవడం.