ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పలు కలకలం చెలరేగింది.న్యాయస్థానంలో లాయర్స్ బ్లాక్ లో ఓ దుండగులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.కాగా దుండగులు మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం కాల్పులు జరపడానికి గల కారణాలతో పాటు దుండగుల కోసం గాలిస్తున్నారు.