ధమాకాపై రవితేజకు ఓపెన్ లెటర్ రాసిన అభిమాని.. ఫొటోస్ వైరల్?

టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన ఎనర్జీ.

 Fan Open Letter To Ravi Teja After Watching Dhamaka Movie Post Went Viral Detail-TeluguStop.com

రవితేజకు తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.ఇకపోతే గత ఏడాది విడుదల అయిన క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న రవితేజ ప్రస్తుతం అదే ఊపుతూ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

క్రాక్ సినిమా తర్వాత రవితేజ కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలలో నటించి మెప్పించాడు.ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ నటించిన సినిమా ధమాకా.

ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

మరి ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుంచి విశేషా స్పందన లభిస్తోంది.

ఇది ఇలా ఉంటే ధమాకా సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించినప్పటికీ మరొక వర్గం ప్రేక్షకులకు పరవాలేదు అనిపించేలా ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ధమాకా సినిమా చూసిన ఒక అభిమాని ఏకంగా రవితేజకు ఓపెన్ గా లెటర్ రాశాడు.ఆ లెటర్ లో అభిమాని ఈ విధంగా రాసుకొచ్చాడు.

రవితేజ సర్.మీరు మారాల్సిన సమయం వచ్చింది అనుకుంటా.నన్ను మారమని చెప్పడానికి నువ్వెవడ్రా అని మీరు అనుకోవచ్చు.కానీ మీరు మారాలి అని చెప్పే హక్కు ఓ వీరాభిమానిగా నాకుంది.అవును మాకు ఒకప్పటి ఇడియట్ రవితేజ కావాలి.అందుకోసమైనా మీరు మారాలి.

సర్ మీరు సినిమాలు తీసుకుంటూ పోతున్నారే గానీ ఒక్కసారైనా వెనక్కితిరిగి చూసుకుంటున్నారా? కొత్త కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తున్నారు.ఈ విషయంలో నేను మీ అభిమానిగా ఎంతో సంతోషిస్తున్నాను.కానీ సాయం పేరుతో నీకు నువ్వే చేసుకుంటున్న గాయం కనిపించడంలేదా? మెగాస్టార్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్రహీరోలను కాదని నీకు అభిమానిగా ఎందుకు మారానో తెలుసా? ఏ ఆధారమూ లేకుండా టాలీవుడ్ అనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నీ మెుక్కవోని ధైర్యాన్ని చూసి.ఇంకో విషయం సర్.చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ.నిజాలు ఎప్పటికీ మారవు.

సో నిజాల్ని ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు.గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేసిన సినిమా పేర్లే గుర్తుండట్లేదు సర్.ఒక అభిమానిగా ఈ మాట చెప్తుంటే టన్నుల కొద్ది బరువు మోస్తున్నట్లుంది.

మీరు మరోసారి మా చేత ‘ఇడియట్’ అని తిట్టించుకుంటే చూడాలని ఉంది సార్.వరల్డ్ కప్ లో దేశం ఓడిపోతే ఎంత బాధపడతామో. ఓ అభిమానిగా మీ సినిమా ఆడకపోతే అంతకంటే ఎక్కువ బాధపడతాం.

మీ సినిమాలను జడ్జ్ చేసేంత స్థాయి నాకు లేదు సర్, కానీ ఓ అభిమానిగా మిమ్మల్ని అగ్రస్థానంలో చూడాలన్న స్వార్థం తప్పితే.మాస్ మహారాజాగా మీరు ఎదిగిన క్రమమే ఓ చరిత్ర.

చరిత్ర ఎప్పటికీ ఆదర్శమే.ఇక చాలా వేదికలపై మీ గురించి స్టార్ హీరోలందరు గొప్పగా చెబుతుంటే నా రోమాలు నిక్కబొడుచుకునేవి.

మరి ఈ లెటర్ చదివిన తర్వాత రవితేజ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.అదేవిధంగా తన తదుపరి సినిమా విషయంలో అయినా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube