ఆ లేడీ అభిమాని అడిగిన ప్రశ్న విని షాకైన గౌతమ్ మీనన్.. ఆ సమయంలో ఇంటర్ చదువుతున్నానంటూ?

తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్‌( Gautham Vasudev Menon ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గౌతమ్ మీనన్‌ ప్రస్తుతం లవ్ అండ్ థ్రిల్లర్ రెండు జోనర్స్ లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్న విషయం తెలిసిందే.

 Gautham Vasudev Menon Shares How His Life Changed After Dhruva Natchathiram Movi-TeluguStop.com

కాగా గౌతమ్ తెలుగులో కూడా పలు సినిమాలు దర్శకత్వం వహించారు.ఇక ఆయనకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే గౌతమ్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ధ్రువ నక్షత్రం( Dhruva Natchathiram ). ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

కాగా డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ మూవీను పదేళ్ల క్రిందటే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.అయితే హీరో మారడం, బడ్జెట్, కరోనా వంటి ప్రాబ్లెమ్స్ తో ఈ మూవీ లేట్ అవుతూ వచ్చింది.అయితే రెండు పార్ట్స్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ నవంబర్ 24న విడుదల కానుంది.

ఇటీవల దసరా పండుగ రోజీ ఈ మూవీ ట్రైలర్( Dhruva Natchathiram Trailer ) ని కూడా విడుదల చేశారు.ఇది ఇలా ఉంటే, ఈ మూవీ గురించి ఒక అమ్మాయి, గౌతమ్ మీనన్ కి ఒక ట్వీట్ చేసింది.

నేను సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో మీరు ధ్రువ నక్షత్రం అనౌన్స్ చేశారు.ఇప్పుడు నేను ఒక ఎంఎన్‌సి కంపెనీలో మూడు సంవత్సరాల అనుభవంతో పని చేస్తున్నాను.

ఈ సినిమా రిలీజ్ చేసేలోపు మీ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అంటూ గౌతమ్ మీనన్ ని ప్రశ్నించింది.ఇక దీనికి గౌతమ్ మీనన్ బదులిస్తూ.ఈ గ్యాప్ లో నేను చాలా నేర్చుకున్నాను.అలాగే మూడు సినిమాలను డైరెక్ట్ చేసి రిలీజ్ చేసేశాను.నాలుగు అంథాలజీ షార్ట్ ఫిలిమ్స్( Anthology Short Films ) చేశాను, ఐదు మ్యూజిక్ వీడియోస్ చేశాను.అలాగే నా ఆలోచన శక్తిని కూడా పెంచుకున్నాను అంటూ బదులిచ్చాడు.

ప్రస్తుతం అందుకు సంబందించిన ట్వీట్ సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఇది చూసిన కొందరు నెటిజెన్స్.

మీరు ఈ గ్యాప్ లో ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు, ప్రధాన పాత్రలు కూడా పోషించారు అంటూ గుర్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube