'శాకుంతలం'లో బాలీవుడ్‌ నటుడు.. ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం “శాకుంతలం“.శాకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలో సమంత సందడి చేస్తున్నారు.

 Bollywood Famous Actor Kabir Bedi In Shaakuntalam Movie, Shaakuntalam, Bollywoo-TeluguStop.com

అదేవిధంగా దుష్యంతుని పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన నటిస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వివిధ భాషలలో ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారనే సమాచారం వినబడుతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు కబీర్‌ బేడీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని హింట్ ఇచ్చారు చిత్ర నిర్మాత నీలిమ గుణ.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పకనే చెప్పేశారు.కబీర్‌ బేడీ రాసిన ‘స్టోరీస్‌ ఐ మస్ట్‌ టెల్‌: ది ఎమోషనల్‌ లైఫ్‌ ఆఫ్‌ ఏన్‌ యాక్టర్‌’ పుస్తకాన్ని నిర్మాత నీలిమకు అందించారు.ఈ విషయంపై స్పందిస్తూ నీలిమ ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేశారు. ‘థ్యాంక్‌ యు కబీర్‌ సర్‌.

మీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.మీరు ఇచ్చిన ఈ పుస్తకాన్ని చదివలేకుండా ఉండలేక పోతున్నాను”.

అంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నిర్మాత నీలిమ ఈ విధంగా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలుపుతూ.దాంతోపాటు ‘శాకుంతలం’ హ్యాష్‌ట్యాగ్‌ జత చేయడంతో ఈ బాలీవుడ్ నటుడు ఈ సినిమాలో నటిస్తున్నారని చెప్పకనే చెప్పేశారు.ఈ క్రమంలోనే ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఈ సినిమాలో శకుంతల కొడుకు భరతుడి పాత్రలో అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube