సలార్ లో నైట్ యాక్షన్ షాట్ కు సిద్దమైన ప్రభాస్!

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.బాహుబలి సినిమా తర్వాత ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత తను చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి.

 Prabhas New Movie, Salaar Budget, Salaar Movie, Salaar Release Date,latest Toll-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలను దక్కించుకొని వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధేశ్యామ్” అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పుడిప్పుడే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.

“రాధేశ్యామ్” చిత్ర నిర్మాణం పూర్తి అయిన వెంటనే ప్రభాస్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” సినిమాలో బిజీ అయ్యారు.ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించింది.

ప్రస్తుతం ఈ రెండవ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లోనే తెరకెక్కిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ప్రస్తుతం భారీ యాక్షన్ నైట్ సన్నివేశాలను తెరకెక్కించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Telugu Prabhas, Salaar Budget, Salaar-Movie

ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ఇప్పటికే  ఓ విలన్ డెడ్ సెట్‏ను కూడా తయారు చేసినట్లు సమాచారం.ప్రస్తుతం షూటింగ్ జరుపుకొనే ఈ యాక్షన్ సన్నివేశం ఈ సినిమాకి హైలెట్ గా మారిబోతుందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది.ఇప్పటికే ఈమె కూడా సినిమా షూటింగులో జాయిన్ అయ్యారని సమాచారం.శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube