పాదయాత్రకే ఫిక్స్ అయిపోయిన షర్మిల ! ముహూర్తం ఎప్పుడంటే ? 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల ఆ పార్టీని యాక్టివ్ గా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పటికే నిరుద్యోగ సమస్యపై వారానికి ఒకరోజు షర్మిల పోరాటం చేస్తున్నారు.

 Ysrtp President Sharmila Padayathra Shedule Announced Ys Sharmila, Telangana, Ja-TeluguStop.com

తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ,  ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు.ఈ అంశంపైనే టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు.

తమ పార్టీకి పెద్దగా బలం లేకపోయినా,  క్రమక్రమంగా పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే కేవలం నిరుద్యోగ సమస్య పై పోరాటం చేస్తూ సైలెంట్ అయిపోవడం షర్మిల కు ఏ మాత్రం ఇష్టం లేదు.

అందుకే తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించాలని ఆమె అప్పుడే డిసైడ్ అయిపోయారు.
      ఇక నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఎన్నికల సమయం వరకు వివిధ సమస్యలపై పోరాటం చేస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి తమ పార్టీ బలం పెరిగేలా చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు.

దీనిలో భాగంగానే అక్టోబర్ 18 నుంచి పాదయాత్ర చేపట్టేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు.పాదయాత్ర చేపట్టే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి,  తన సోదరుడు జగన్ ఇద్దరు అధికారంలోకి వచ్చారని,  తాను కూడా అదేవిధంగా అధికారంలోకి వచ్చేందుకు ఈ పాదయాత్ర దోహదం చేస్తుందని నమ్ముతున్నారు.

తెలంగాణలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Telugu Chevella, Jagan, Padayathra, Telangana, Un, Ys Sharmila, Ysrcp-Telugu Pol

  తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన చేవెళ్ల  నుంచి తాను పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.గతంలో షర్మిలకు పాదయాత్ర చేసిన అనుభవం ఉండడంతో ఇప్పుడు పెద్దగా ఇబ్బంది లేకుండా ఈ యాత్ర సక్సెస్ అవుతుందని షర్మిల పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు.అయితే పార్టీలో చేరికలు పెద్దగా లేకపోవడం కాస్త నిరాశ కలిగిస్తున్నా, ముందు ముందు చేరికలు ఊపందుకుంటాయి అని నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube