Actor Ananda Chakrapani: సిసలైన నటుడు ఆనంద చక్రపాణి… సహజత్వానికి దగ్గరగా అయన నటజీవితం!

తెలుగు నటుడు, క్యారక్టర్ ఆర్టిస్ట్ ఆనంద చక్రపాణి( Actor Ananda Chakrapani ) గురించి అతి కొద్దిమందికి తెలుసు.అయితే సినిమాను ప్రేమించే ప్రతిఒక్కడికి అయన నటన సుపరిచితమే.

 Facts About Actor Ananda Chakrapani-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, కనగల్ మండలం, గడ్డంవారి యడవల్లి గ్రామంలో ఆగస్టు 18న ఆనందపు పుల్లయ్య, మల్లమ్మ దంపతులకు జన్మించాడు ఆనంద చక్రపాణి.తరువాత ఇతని కుటుంబం మిర్యాలగూడ సమీపంలోని దామెరచర్ల మండలం, కొండ్రపోలు గ్రామానికి వలస వచ్చింది.

చక్రపాణి అప్పట్లో మెట్రిక్క్యులేషన్ (పదవ తరగతి) పూర్తిచేసి హైదరాబాదు వచ్చి శివంరోడ్డులోని ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో విజువలైజర్, కాపీ రైటర్‌గా పనిచేశాడు.అప్పుడప్పుడు కవిత్వం రాసేవాడు, జర్నలిస్టుగా కూడా పనిచేశాడు.

Telugu Dasi, Mallesham, Telangana-Movie

సినిమాల మీద మక్కువతో అప్పటి మద్రాసు (చెన్నై) వెళ్లి వచ్చేవాడట.ఈ క్రమంలో ఆనంద చక్రపాణి 1988 లోనే “దాసి”( Dasi ) అనే అవార్డు సినిమాలలో నటించాడు.మరి “దాసి” సినిమాలో నటించాక అయన 33 సంవత్సరాలు సినిమాలలో ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.అయితే మరలా చాన్నాళ్ల తరువాత ‘మల్లేశం’ సినిమాలో( Mallesham Movie ) మెరిశాడు.

సాధారణంగా ఈ సినిమా గురించి మాట్లాడినపుడు ప్రియదర్శి, అనన్య, ఝాన్సీల పాత్రల పైన అందరూ ఫోకస్ చేసారు గానీ, ఆనంద చక్రపాణి నటనను పొగుడుతూ పోస్ట్ చేసిన ఆర్టికల్స్ ఎక్కడా మనకు కనిపించవు.కానీ సహజమైన నటనకి కొలమానం ఆనంద చక్రపాణి.

Telugu Dasi, Mallesham, Telangana-Movie

ఆ తరువాత “అనగనగా ఒక అతిథి”( Anaganaga O Athidi ) అనే సినిమాలో ఆనంద చక్రపాణి నటవిశ్వరూపాన్ని మనం చూడవచ్చు.కేవలం నాలుగే పాత్రలతో నడిచే ఆ సినిమాలో నలుగురూ గొప్పగా నటించారు అని చెప్పుకోవచ్చు.ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్, ఆనంద చక్రపాణిలు పోటీ పడి నటించారని చెప్పుకోవాలి.ఆ సినిమా చూశాక ఆనంద చక్రపాణి అంటే ఎవరో తెలుసుకోవాలనే ఆలోచన రాక తప్పదు.

అయితే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మధ్యలోనే పోరాటాన్ని విరమించుకునే ఎంతోమందికి ప్రేరణ ఆనంద చక్రపాణి జీవితం అని చెప్పుకోవచ్చు.ఆనంద చక్రపాణిలో అన్ని షేడ్స్ ఉన్న నటుడు ఉన్నాడు.

ఒకేరకమైన పాత్రలు కాకుండా భిన్నమైన పాత్రల్లో నటించగలిగే పరిపూర్ణమైన తెలంగాణ నటుడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube