ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) కీలక ప్రకటన చేశారు.వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్( AP DSC 2023 ) విడుదల చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని త్వరలో ప్రకటన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి అధికారులు కసరత్తులు చేస్తున్నారని.
త్వరలోనే ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించి అభ్యర్థులు ఎప్పటినుండో ఎదురుచూస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో మంత్రి బొత్స ప్రకటనతో నిరుద్యోగులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంవత్సరాలు తరబడి డీఎస్సీ కోసం ట్రైనింగ్ తీసుకుని ప్రభుత్వం ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఎదురుచూస్తున్న వారు తాజా ప్రకటనతో సంతోషంగా ఉన్నారు.జగన్ ( CM Jagan ) ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు.
ఇటువంటి తరుణంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో.నిరుద్యోగులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.