ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం.. ఎంపీ విజయసాయిరెడ్డి

ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.దాదాపు పది సంవత్సరాల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నాడు వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని తెలిపారు.

 Extreme Injustice To Ap In The Matter Of Special Status.. Mp Vijayasai Reddy-TeluguStop.com

పార్టీలు, ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.అదేవిధంగా రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలో ప్రజలు నిర్ణయించుకుంటారని తెలిపారు.

అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.అందుకే ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదించామని వెల్లడించారు.

రాజధాని అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపారు.మెట్రో విషయంలో ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube