వైద్య ఆరోగ్యశాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమైన మంత్రి రజినీ సమాధానం చెప్పలేక చంద్రబాబును విమర్శిస్తుందన్నారు మాజీ మంత్రి ,టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు.చంద్రబాబు నాయుడు ను విమర్శించే అర్హత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేదన్నారు.
రాష్ట్రంలో అసమర్థ మంత్రులలో చిలకలూరిపేట మంత్రి మొదటి స్థానంలో ఉందన్నారు ప్రత్తిపాటి.వంద పడకల ఆసుపత్రి వద్ద సెల్ఫీ చాలెంజ్ విసిరితే ఇంతవరకు మంత్రి సమాధానం చెప్పలేదన్నారు.
వంద పడకల ఆసుపత్రి ఎప్పటి లోపు పూర్తి చేస్తావో కనీసం ఓట్లు వేసిన ప్రజలకైనా సమాధానం చెపప మన్నారు ప్రత్తిపాటి.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాబార్డు ద్వారా వంద పడకల ఆసుపత్రికి నిధులు తెస్తే ఇంతవరకు పూర్తి చేయలేని అసమర్థ వైద్య మంత్రి రజినీ అని ఆయన విమర్శించారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అట్టర్ ప్లాప్ అయిందన్నారు.వైద్య మంత్రి మీడియా పత్రికల్లో ఆరోగ్యశ్రీ గురించి డబ్బాలు కొట్టుకోవడం తప్ప గ్రౌండ్ రియాల్టీ లేదని ఎద్దన చేశారు ప్రత్తిపాటి.
ఆరోగ్య శ్రీ క్రింద ఎంత మందిని చేర్చుకున్నారు ఎంత నిధులు విడుదల చేశారో సమాధానం మంత్రి చెప్పాలన్నారు.