టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.బిజెపి బలమే కాకుండా, తన సొంత బలం ఎంత ఉంది అనేది నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం తనకు కంచుకోట అని , ఆ కోటకు బీటలు పెట్టడం టిఆర్ఎస్ వల్ల కాని పని అని నిరూపించే ప్రయత్నం రాజేందర్ చేస్తున్నారు.టిఆర్ఎస్ తనపై అనర్హత వేటు వేయక ముందే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లేందుకు రాజేందర్ సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం పై దృష్టి పెట్టడం, మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో తన పట్టు ఎక్కడా కోల్పోకుండా రాజేందర్ ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే ఢిల్లీకి వెళ్లి బిజెపి హుజరాబాద్ నియోజకవర్గం లో అడుగు పెట్టి, ఆ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించాలనే ప్లాన్ రాజేందర్ వేసుకున్నారు.

ఈ నియోజకవర్గం లోని మారుమూల పల్లెలు సైతం కవర్ అయ్యేలా రాజేందర్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఈ పాదయాత్ర లో తనకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం పైన అనేక ప్రజా సమస్యల విషయంపైన రాజేందర్ ప్రజల్లో కి వెళ్లి ప్రజల సానుభూతి పొందాలని రాజేందర్ ప్లాన్ చేసుకుంటున్నారు.
తన ఒక్కడిని ఓడించేందుకు టీఆర్ఎస్ మంత్రులు ఇంతగా దృష్టిపెట్టారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి సానుభూతి పొందేలా రాజేందర్ ప్లాన్ చేసుకుంటున్నారు.ఇక తాను బీజేపీ లోకి వెళ్లే సమయంలో టిఆర్ఎస్ నాయకులను తన వెంట తీసుకొని బిజెపి హుజూరాబాద్ టిఆర్ఎస్ ప్రభావం పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.