భారతదేశంలోని టెస్లా కార్లను విక్రయించాలని ఎలాన్ మస్క్ కోరుకున్నారు కానీ అందుకు ప్రభుత్వం సహకరించలేదు.కార్లను అమ్మాలన్నా లేదా సర్వీస్ సెంటర్లు పెట్టాలన్నా మస్క్ ఒక కండిషన్ కి లోబడి ఉండాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదేంటంటే దేశంలో టెస్లా కార్లను తయారు చేయడం మొదలుపెడితేనే విక్రయించడానికి అనుమతిస్తామని కేంద్రం సూటిగా చెప్పింది.కానీ అందుకు మాత్రం మస్క్ ఒప్పుకోవడం లేదు.
మొదట తమ కార్లను విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ప్రభుత్వ షరతుకు ఒప్పుకుంటానని మస్క్ చెబుతూనే వస్తున్నారు.ఈ విషయాన్ని ఆయన మరొకసారి స్పష్టం చేశారు.
భారత్‌లో వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మొట్టమొదటిగా ఏర్పాటు చేసే అవకాశమే లేదు ఆయన తాజాగా వెల్లడించారు.
ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘మమ్మల్ని మొదట కార్లు విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి అలో చేయని ఏ దేశంలోనైనా టెస్లా కారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను నిర్మించదు’ అని మస్క్ ఓ ట్వీట్ ద్వారా కుండ బద్దలు కొట్టారు.
ఇదిలా ఉండగా టెస్లా కార్లు విక్రయించడానికి దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రాన్ని మాస్క్ ఎప్పటి నుంచో కోరుతున్నారు.ఈ విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందించడం లేదు.
ఒకవేళ ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే మస్క్ కి నచ్చినట్లు దిగుమతి సుంకం తగ్గించే అవకాశం ఉంది.

ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎక్కువగా కస్టమ్స్ ట్యాక్స్ భారతదేశంలో వసూలు చేస్తున్నారని గతంలో మస్క్ భారతదేశం పై అసహనం వ్యక్తం చేశారు.40 వేల డాలర్ల కంటే ఎక్కువ ఖరీదైన కార్లపై 100 శాతం పన్నులను భారత్ వసూలు చేస్తోంది.అంతకన్నా తక్కువగా మిగతా కార్లపై 60 శాతం పన్ను తీసుకుంటోంది.