Elephant Bounces Bike: వైరల్ : ఏనుగుకి బైక్ నచ్చలేదేమో, ఒకే దెబ్బకు తుక్కుతుక్కు చేసేసింది చూడండి!

జంతువులలో ఏనుగులు కాస్త సాధుజంతువులనే చెప్పుకోవాలి.వాటి జోలికి వెళ్తే తప్ప, వాటంతట అవి ఇతరులకు ఈ హాని కలిగించవు.

 Elephant Creates Rampage In Ranchi Bounces Bike Details, Elephant, Bike, Playin-TeluguStop.com

అవి అడవిలో వున్నా బయట సంచరించినా వాటి ప్రవర్తనలో ఏ తేడా ఉండదు.కానీ ఒక్కసారి వాటికీ ఏదో హాని జరుగుతుంది అని అనుకున్నాయో, ఇక అంతే భీభత్సం సృష్టిస్తాయి.

తాజాగా అలాంటి ఓ ఘటన వెలుగు చూసింది.జార్ఖండ్ లోని రాంచీ సమీపంలో కూర్త్ బహత్ అనే గ్రామంలో ఒక భారీ ఏనుగు బీభత్సం సృష్టించింది.

అడవిలోనుండి జనారణ్యంలోకి వచ్చిన సదరు ఏనుగు మొదట వ్యవసాయ పొలాలను నాశనం చేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.దాంతో వారు దానికి భయపడుతూ పరుగులు పెట్టడంతో వారిని చూసిన ఏనుగు కూడా కాస్త భపడింది.

దాంతో దానికి దారిలో అడ్డువచ్చిన ఓ బండిని దాని తొండంతో విసిరి నేలకేసి కొట్టింది.ఇక అంతే, ఆ బండి చెక్క చెక్కలు అయింది.ఆ దృశ్యాన్ని చూసిన బైక్ యజమాని లబోదిబో అన్నాడు.అతని అరుపులు కేకలు వీడియోలో మీరు గమనించవచ్చు.

ఏనుగును తరిమేందుకు గ్రామస్తులు చేసిన అతివలనే ఏనుగు ఈ విధంగా ప్రవర్తిస్తోందని తెలుస్తోంది.

ఏనుగును తరిమే క్రమంలో వారు పెద్దగా శబ్దాలు చేయడంతో కోపంతో ఊగిపోయిన ఏనుగు విచక్షణను కోల్పోయినట్టు సమాచారం.దాదాపు 70 కేజీలు వున్న బండిని తన తొండంతో అలవోకగా పైకి ఎత్తి రోడ్డుపై పడేయడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.బైక్ యజమాని అప్పుడే తన సామాన్లు అమ్ముకుని ఇంటికి వెళ్తూ ఉండగా టీ తాగుదామని టీ స్టాల్ దగ్గర ఆగడం సరిపోయింది.

లేదంటే అతను కూడా ఏనుగు కోపానికి బలైయేవాడు.ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది.వీడియో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube