21 Lakhs Bike : రూ.21 లక్షలు పెట్టి బైక్‌ కొన్నాడు, కానీ ఏం లాభం.. 15 రోజులకే కాలిపోయింది!

నేటితరం యువకులకు బైకులంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో కలలు కని తమకి ఇష్టమైన బండిని కొనుక్కుంటూ వుంటారు.

 He Bought A Bike With Rs. 21 Lakhs, But What Was The Profit It Got Burnt In 15-TeluguStop.com

ఇంకొందరు డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ బైక్ ని సొంతం చేసుకుంటారు.మరొకొందరైతే తమ నాన్నకి బండి కొనమని వేడుకుంటారు.

అయితే అలా ఎన్నో ప్రయాసలు కోర్చి సంపాదించిన బైక్ సడెన్ గా కాలి బూడిదైతే ఆ బాధ వర్ణనాతీతం.అది కూడా 20 లక్షలు పైగా పోసి కొనుక్కున్న బండి మంటల్లో దగ్దమైతే… ఆ బాధ పగవాడికి కూడా రాకూడదు.కానీ ఇక్కడ అదే జరిగింది.

ఓ యువకుడు ఎంతో మనసుపడి తన కలల బండిని కొనుగోలు చేసాడు.

దాన్ని షోరూమునుండి ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లాడు.స్థానికులు ఆ బండిని ఓ చూపు చూసారు.

అంతలో ఏం జరిగిందో తెలీదు.అదేరోజు రాత్రి ఆ ఖరీదైన బైక్‌ అగ్నికి ఆహుతైంది.

గురువారం రాత్రి మహారాష్ట్ర కొల్హాపుర్‌లోని కలంబలో ఈ ఘటన చోటుచేసుకుంది.స్టాక్‌ మార్కెట్‌ వ్యాపారం చేసే రాజేశ్‌ చౌగ్లే దీపావళి సందర్భంగా రూ.21 లక్షలు పెట్టి బైక్‌ను కొనుగోలు చేశాడు.షోరూం నుంచి డప్పుల మోతలతో ఊరేగింపుగా దానిని ఇంటికి తీసుకెళ్లాడు.

Telugu Days, Lakhs, Kalamba, Kolhapur, Latest, Maharashtra, Bike, Rajesh Chowgle

అదే బైక్‌ గురువారం రాత్రి అనుమానాస్పద రీతిలో దగ్దమవడంతో అతని గుండె జారిపోయింది.అసలు ఆ బైక్‌కు నిప్పు ఎలా అంటుకుంది? అనే విషయం ఇప్పటికీ అర్థం కావట్లేదని రాజేశ్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.మహారాష్ట్రలో “కవాసకి నింజా జెడ్‌ఎక్స్‌-10 ఆర్‌” మోడల్‌ బైక్‌ను కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి అతడే కావడం విశేషం.దాంతో ఆ బండిని చూడటానికి స్థానికులతో పటు చుట్టుపక్కల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చారట.

కానీ ఇలా జరగడం దురదృష్టకరం అని స్థానికులు చెబుతున్నారు.కాగా రాజేశ్‌ వద్ద ఇప్పటికే అనేక కార్లు, స్పోర్ట్స్‌ బైక్‌లు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube