బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు.ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ లో నాలుగు ఫొటోలను షేర్ చేశారు.
ఈ ఫొటోల్లో ప్రధాని నరేంద్ర మోదీకి నితీశ్ నమస్కారాలు చేస్తున్నట్లు ఉంది.నెల రోజుల కిందటి వరకు బీజేపీతో ఉన్న నితీశ్ కుమార్.
ఇప్పుడు విపక్షంతో ఉన్నారని ఎద్దేవా చేశారు.ఇతరులపై ఆధారపడకుండా ఆయన ఉండలేరమోనని విమర్శించారు.
బీహార్ లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందని భావించడం లేదని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.అయతే, పీకే బీజేపీతో ఉండాలనుకుంటున్నారని నితిశ్ వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.