దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఈడీ ఇవాళ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది.
ఈ క్రమంలో ఈడీ ఛార్జ్‌షీట్ లో పేర్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రూ.100 కోట్లను విజయ్ నాయర్ ద్వారా ఆప్, ఎక్సైజ్ శాక అధికారులకు అందజేశారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.ఛార్జ్‌షీట్ లో శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా సహా పలువురి ప్రముఖుల పేర్లు ఉండే అవకాశం ఉంది.
ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సమీర్ మహేంద్రు పేర్లను ఛార్జ్‌షీట్ లో ఈడీ ప్రస్తావించింది.సమీర్ మహేంద్రు కంపెనీలపై నవంబర్ లో తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
అదేవిధంగా లిక్కర్ స్కాం కేసులో సౌత్ గ్రూప్ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.