విండోస్ నుంచి ఆండ్రాయిడ్ డివైజ్‌లకు సులభంగా ఫైల్స్ పంపుకోవచ్చిలా

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే వారికి ఆండ్రాయిడ్ డివైజ్‌లుక ఫైల్స్ ఎలా పంపించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ ముందడుగు వేసింది.‘గూగుల్ నియర్‌బై షేర్( Nearby Share )’ పేరుతో కొత్త యాప్ తీసుకొచ్చింది.దీంతో విండోస్-ఆండ్రాయిడ్( Android ) పరికరాల మధ్య ఫైల్‌లను బదిలీ చేయడం గతంలో కంటే ఇప్పుడు సులభంగా మారింది.

 Easily Transfer Files From Windows To Android Devices Easily, Transfer, Techno-TeluguStop.com

ఈ ఫీచర్ గతంలో స్మార్ట్‌ఫోన్ నుండి స్మార్ట్‌ఫోన్ ఫైల్ షేరింగ్ కోసం మాత్రమే అందుబాటులో ఉండేది.కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్‌లు, విండోస్ పీసీలు రెండింటికీ అందుబాటులో ఉంది.

వైర్‌లెస్ షేరింగ్ కోసం గూగుల్ డెస్క్‌టాప్ యాప్‌ను విడుదల చేసింది.ఇది ఆండ్రాయిడ్ ఫోన్, విండోస్ కంప్యూటర్ వినియోగదారులకు వైర్‌లెస్‌గా ఫైల్‌లను బదిలీ చేయడానికి సాయపడుతుంది.

విండోస్( Windows ) కోసం ‘గూగుల్ నియర్‌బై షేర్’ని డౌన్‌లోడ్ చేయడానికి, ఈ దశలను అనుసరించండి.ముందుగా మీ పీసీలో android.com/better-together/nearby-share-app లింక్ ఓపెన్ చేయండి.

తర్వాత “గెట్ స్టార్టెడ్‌” పై క్లిక్ చేయండి.exe ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి.డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌ను ఓపెన్ చేసి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించండి.ఇది పూర్తైన తర్వాత మీ గూగుల్( Google ) ఖాతాకు సైన్ ఇన్ చేయండి.

యాప్ ప్రస్తుతం ఈ లింక్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది.

Telugu Android, Easily, Latest, Ups, Transfer, Windows-Latest News - Telugu

అయితే ఇది అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రోమ్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.ఇక ‘గూగుల్ నియర్‌బై షేర్’ని ఉపయోగించడానికి, విండోస్ గ్యాడ్జెట్ నుంచి ఆండ్రాయిడ్ పరికరానికి ఫైల్‌లను పంపించడానికి ఈ దశలను అనుసరించండి.మీ విండోస్ పరికరంలో ‘గూగుల్ నియర్‌బై షేర్’ని ఇన్‌స్టాల్ చేసి, మీ ఆండ్రాయిడ్ పరికరంతో పెయిర్ చేయండి.

ఆండ్రాయిడ్‌లో షేర్ మెనుని ఉపయోగించండి.లేదా విండోస్‌లో ఫైల్‌లను డ్రాగ్ చేసి డ్రాప్ చేయవచ్చు.

ఫైల్‌ను ఎవరికి పంపించాలో ఎంచుకోండి.ఫైల్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ముందు ఫైల్‌లను పొందే వారు దానిని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది.

Telugu Android, Easily, Latest, Ups, Transfer, Windows-Latest News - Telugu

అయితే, మీరు మీకే ఫైల్‌లను పంపుకుంటున్నట్లయితే, అవి ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతాయి.మీరు ‘గూగుల్ నియర్‌బై షేర్’ బీటాను ఉపయోగించి ఫోటోలు, స్క్రీన్‌షాట్‌లు, వీడియోలు, డాక్యుమెంట్లు వంటి వివిధ రకాల ఫైల్‌లను షేర్ చేయవచ్చు.రెండు పరికరాలు మీ గూగుల్ ఖాతాలోకి లాగిన్ అయినట్లయితే, ఫైల్ షేరింగ్ ఆటోమేటిక్‌గా ఆమోదించబడుతుంది.ఆండ్రాయిడ్ నుండి పీసీకి ఫైల్‌లను షేర్ చేయడానికి, మీ పీసీలో సమీప షేర్ బీటా యాప్ రన్ అవుతుందని నిర్ధారించుకోండి.

అందుబాటులో ఉన్న గ్యాడ్జెట్స్ జాబితా నుండి పీసీని ఎంచుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube