ఏపీలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.త్వరలోనే ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.విశాఖ పరిపాలన రాజధాని తమ పాలసీ అని చెప్పారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కొందరు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారన్నారు.స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నామని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని మరోసారి తేల్చి చెప్పారు.అదేవిధంగా విద్యార్థులకు రాగి జావ నిలిపివేశారన్న ప్రచారం తప్పని వెల్లడించారు.