కామారెడ్డి బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్ధతు ఉంటుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా క్షేత్రంలో సభలు నిర్వహించి రైతులతో చర్చించాలని తెలిపారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే సమస్య మరింత జఠిలంగా మారుతోందని విమర్శించారు.
ఇప్పటికైనా రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారిని సరైన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా బాధిత రైతులకు మద్ధతు తెలిపేందుకు రెండు బృందాలుగా కాంగ్రెస్ నేతలు కామారెడ్డికి బయలుదేరారు.