ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రుద్రమదేవి’ విడుదలకు ముహూర్తంను ఇటీవలే ఫిక్స్ చేసిన విషయం తెల్సిందే.ఈ సినిమాను ఈనెల 26న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే గుణశేఖర్ అధికారికంగా ప్రకటించాడు.
అయితే తాజా పరిణామాలను చూస్తుంటే ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయంటూ సినీ వర్గాల ద్వారా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జేమ్స్‌బాండ్’ను అదే తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ సినిమా విడుదలకు మరో రెండు వారాలు కూడా మిగిలి లేవు.అయినా ఇప్పటి వరకు ఆ సినిమా ప్రమోషన్‌ను గుణశేఖర్ ప్రారంభించింది లేదు.
దాంతో ఈ సినిమా విడుదలకు ఇంకా క్లియరెన్స్‌ను ఫైనాన్సియర్స్ నుండి గుణశేఖర్ తీసుకు రాలేక పోయాడా అనే ఊహాగాణాలు వస్తున్నాయి.ఒక వేళ ‘రుద్రమదేవి’ ఈనెల 26కు రాని పక్షంలో ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
జులైలో ‘బాహుబలి’ మరియు ‘శ్రీమంతుడు’ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.దాంతో ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అలా కాకుండా ఆర్ధిక పరిస్థితులు అన్ని సర్దుకుని, అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయడంలో గుణశేఖర్ సక్సెస్ అవుతాడో చూడాలి.ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే.
రుద్రమదేవిగా అనుష్క నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రానాలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.