అమెరికా అధ్యక్షుడంటే ఈ ప్రపంచానికి పెద్దన్న.ఆయన కాలు బయటపెట్టాలంటే మామూలు విషయం కాదు.
అధ్యక్షుడు పలనా ప్రాంతానికి పర్యటనకు వెళ్తున్నాడంటే అంతకు కొద్దిరోజుల ముందే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని కంట్రోల్‌లోకి తీసుకుంటాయి.చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా పటిష్ట భద్రత మధ్య అమెరికా అధ్యక్షుడి పర్యటన సాగుతుంది.
ఇదే స్థాయిలో కాకపోయినా ఆ దేశంలోని చట్టసభ సభ్యులకు వేరే దేశంలో భారీగానే భద్రత వుంటుంది.ఎందుకంటే వారికి ఏమైనా జరిగితే పెద్దన్న ఆగ్రహానికి గురికావాల్సి వుంటుందన్న భయంతో దాదాపు అన్ని దేశాలు తమ దేశానికి వచ్చిన అమెరికా చట్టసభ సభ్యులను కంటికి రెప్పలా కాపాడుతూనే వుంటాయి.
అయితే సరిగ్గా 13 ఏళ్ల క్రితం సెనేటర్‌గా వున్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆఫ్ఘనిస్తాన్‌లో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.అది కూడా ఓ సాధారణ ఆఫ్ఘన్ పౌరుడి దయ వల్ల.
ఇప్పుడు నాటి సాయానికి కృతజ్ఞతగా తనను, తన కుటుంబాన్ని రక్షించాలంటూ ఆ వ్యక్తి ఏకంగా జో బైడెన్‌కు లేఖ రాశాడు.
అసలు ఏం జరిగిందంటే:
13 ఏళ్ల కిందట డెలావేర్ సెనేటర్‌గా ఉన్న జో బైడెన్, పలువురు ప్రతినిధులతో కలిసి ఆఫ్ఘనిస్థాన్ వెళ్లారు.ఆ సమయంలో ఆఫ్ఘన్ పౌరుడైన మహ్మద్ అనే వ్యక్తి అమెరికా మిలిటరీకి దుబాసిగా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలో బైడెన్‌తోపాటు పలువురు ఇతర చట్టసభ ప్రతినిధులు ప్రయాణిస్తున్న రెండు బ్లాక్ హాక్ హెలికాఫ్టర్లు కనిపించకుండాపోయాయి.
వెంటనే రంగంలోకి దిగిన అమెరికా దళాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి.వారి వెంట మహ్మద్ కూడా వున్నాడు.ఆ రెండు హెలికాప్టర్లు ఓ మారుమూల ఆఫ్ఘన్ లోయలో ఎమర్జెన్సీ ల్యాండయ్యాయి.
ఆ సమయంలో బర్‌గ్రామ్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న మహ్మద్.
అమెరికా దళాలతో కలిసి హెలికాప్టర్లను వెతకడానికి వెళ్లాడు.హెలికాప్టర్‌లను గుర్తించిన తర్వాత ఇతర ఆఫ్ఘన్ ఆర్మీ జవాన్లతో కలిసి వాటికి రక్షణగా నిలిచాడు.
అలా 30 గంటలపాటు గడ్డ కట్టించే చలిలో మహ్మద్.బైడెన్‌తోపాటు ఇతర ప్రతినిధులకు సహాయకుడిగా వ్యవహరించాడు.
అనంతరం అమెరికా దళాలు బైడెన్‌తోపాటు ఇతర ప్రతినిధులు ఉన్న హెలికాప్టర్‌ను సురక్షితంగా అక్కడి నుంచి తరలించాయి.

అయితే ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు వశపరుచుకోవడంతో మహ్మద్ తీవ్ర ఆందోళనలకు గురవుతున్నాడు.దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష పెట్టామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ.ఈ 20 ఏళ్ల కాలంలో తమకు వ్యతిరేకంగా అమెరికా, నాటో దళాలకు సహాయం చేసిన వారిని తాలిబన్లు ఇంటింటికి వెళ్లి వెతుకుతున్నారు.
దీనికితోడు ఇలాంటి వారి జాబితాను స్వయంగా అమెరికా సేనలే.తాలిబన్లకు ఇచ్చాయన్న వార్తల నేపథ్యంలో మహ్మద్ మరింత కంగారు పడుతున్నాడు.అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచి వెళ్లడంతో ఏ క్షణంలోనైనా తాలిబన్లు తనను, తన కుటుంబాన్ని హతమారుస్తారని అతను ఫిక్స్ అయ్యాడు.తాలిబన్లు తనపై ఎప్పుడు విరుచుకుపడతారో తెలియక భార్య, నలుగురు పిల్లలతో కలిసి బిక్కుబిక్కుమంటూ ఆఫ్ఘన్‌లో కాలం గడుపుతున్నాడు.
ఈ నేపథ్యంలో అప్పుడు మిమ్మల్ని కాపాడాను, నన్ను మరచిపోకండి.నన్ను, నా కుటుంబాన్ని రక్షించమంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మహ్మద్ లేఖ రాశాడు.దీనిపై వైట్‌హౌస్ సానుకూలంగా స్పందించింది.నిన్ను, నీ కుటుంబాన్ని కచ్చితంగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలిస్తామని సమాధానం ఇచ్చింది.