ప్రస్తుతం బీజేపీ అంటే మోడీ.అమిత్ షా..మోడీ పెరు చెప్పుకునే ఆ పార్టీ రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుంది.మోడీ.అమిత్ ల ద్వయం దేశాన్ని నడిపిస్తోంది.రెండు సార్లు బీజేపీ నుంచే గుజరాత్ చెందిన వాళ్లే ప్రధానిగా కొనసాగుతున్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభర్థి ఎవరు అనే దానిపై కొద్దిరోజులుగ చర్చ జరుగుతోంది.
అయితే మోడీ అంత ప్రభాం చేసే మరో నాయకుడు లేడన్నది వాస్తవం.చిన్న పల్లెటూళ్లో మోడీ అంటేనే అందరికి తెలుస్తుంది.
మోడీ అంటేనే బీజేపీ.బీజేపీ అంటే మోడీ అనేంతగా మార్పు రావడంతో.
మరో నేతను అభ్యర్థిగా ప్రకటిస్తే జనాలకు తెలిసే అవకాశమే ఉండదు.అయితే బీజేపీలో 70 ఏళ్లకు పైబడిన వారిని ఇంటికే సాగనంపుతుంటారు.
యాక్టివ్ గా ఉన్నా.పంపేస్తుంటారు.2014 కేబినెట్ లో కేంద్ర మంత్రులుగా చేసిన రవిశంకర్.జవదేకర్ లాంటి ఎంతో మంది యాక్టివ్ బీజేపీ నేతలను ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పిస్తున్నారు.
బీజేపీలో పనిచేసే సామర్థ్యం ఉన్నా వారిని కూడా పక్కన పెట్టిన మోడీ షాల ద్వయం.మరి 2024లో బీజేపీకి ముఖం లాంటి మోడీని తప్పించగలరా.? 70 ఏళ్లు దాటిన మోడీకి విశ్రాంతినిచ్చి యూపీ సీఎం యోగిని పీఎం చేయగలరా.? మోడీ కాకుండా మరో ముఖం ప్రధాని అభ్యర్థి అంటే గెలిచే అవకాశాలు తక్కువని అందరికీ తెలుసు.అయితే 70 ఏళ్ల నియమం మోడీకి వర్తిస్తుందా.రిటైర్మెంట్ తీసుకుంటారా.తీసుకునేలా చేసే మరో నాయకుడు ఉన్నాడా.అంటే లేడనే చెప్పాలి.
ఎందుకంటే బీజేపీలో మోడీ తప్ప వేరే ముఖం లేదు.జనాలు ఆయన ముఖం చూసే ఓటేస్తున్నారు.
ఆయనను పక్కకు తప్పించే ధైర్యం ఎవరికీ లేదు.మోడీని పక్కనపెడితే బీజేపీని ప్రజలు పక్కనపెడుతారన్న విషయం కూడా తెలిసిందే.

ఆయనే మళ్లీ.
అయితే అప్పట్లో మోడీ తర్వాత ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పీఎం అవుతారని ప్రచారం జరిగింది.యోగీ పేరు తెరమీదకు తేవడంతో దేశవ్యాప్తంగా వినిపించింది.
అంతా యోగి నెక్ట్స్ పీఎం అనుకున్నారు.యూపీ ఎన్నికల సమయంలో కూడా అమిత్ షా సరేనన్నట్టు చేశారు.
అయితే ప్రస్తుతం ఎన్నికలకు రెండేళ్లు ఉండడంతో మరోసారి బీజేపీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చేశారు.మోదీనే తమ అభ్యర్థి అని కార్యకర్తలకు స్పష్టం చేశారు.
అస్సలు అలాంటి ఆలోచన కూడా లేదని గట్టిగా చెప్పారు.తాజాగా 2024లో బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానిపై క్లారిటీ ఇస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు.
ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.అలాగే జేడీయూతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.