Keerthana : మొగలిరేకులు సీరియల్ నటి కీర్తన గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మొగలిరేకులు( mogalirekulu ) సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో ఈ సీరియల్ ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

 Do You Remember Mogilirekulu Serial Fame Medha Bahri What She Doing Now-TeluguStop.com

తెలుగు బుల్లితెర పై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సీరియల్స్ లో అప్పట్లో ఈ సీరియల్ టాప్ లో నిలిచింది.అంతేకాకుండా కొన్ని సంవత్సరాల పాటు తెలుగు టెలివిజన్ రంగంలో టిఆర్పి రేటింగ్స్ తో మొదటి స్థానంలో నిలిచింది.

మంజుల నాయుడు దర్శకత్వం వహించిన ఈ సీరియల్ దాదాపు మూడేళ్ల పాటు సాగింది.ఈ సీరియల్ కి భారీగా అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు.

Telugu Devi, Keerthana, Medha, Mogilirekulu, Munna, Selva, Shanti-Movie

కాగా అభిమానుల కోరిక మేరకు ఈ సీరియల్ ని ప్రస్తుతం మరోసారి ఈటీవీ ప్లస్ లో ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే.తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఈ మొగలిరేకులు సీరియల్ ని ఎప్పటికీ మరిచిపోలేరు అని చెప్పవచ్చు.మరి ముఖ్యంగా ఇందులో నటించిన నటీనటులకు భారీగా గుర్తింపు దక్కింది.ముఖ్యంగా ఇందులోని ఆర్కే నాయుడు, మున్నా, శాంతి, సెల్వ, దేవి, కీర్తన లాంటి పాత్రలు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.

ఇందులో ఒకే అమ్మాయి రెండు విభిన్న పాత్రలు పోషించింది.అందులో తన అమాయకమైన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

Telugu Devi, Keerthana, Medha, Mogilirekulu, Munna, Selva, Shanti-Movie

ఆమె మరెవరో కాదు మొగలిరేకులు సీరియల్ కీర్తన( keerthana ).ఇందులో అమాయకమైన అమ్మాయి పాత్రలో ఎప్పుడూ ఏడుస్తూ నటిస్తూనే ప్రేక్షకుల మనసులలో చరగని ముద్రను వేసుకుంది.ఈమె అసలు పేరు మేధా.అయితే ఈ సీరియల్ లో నటించడానికి అంటే ముందు ఈమె చక్రవాకం సీరియల్ లో కూడా నటించిన విషయం తెలిసిందే.అలా బుల్లితెరపై చక్రవాకం,మొగలిరేకులు,అపరంజి,సూర్య పుత్రుడు లాంటి మంచి మంచి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా పలు సినిమాలలో నటించి మెప్పించింది.

ఇక చివరగా మేధా రాజేంద్ర ప్రసాద్( Medha Rajendra Prasad ) నటించిన మీ శ్రేయోభిలాషి సినిమాలో నటించింది.తర్వాత అటు వెండితెరకు ఇటు బుల్లితెరకు దూరమయింది.

ఇప్పటికీ ఈమెను చూస్తే చాలు ఈమె మొగలిరేకులు కీర్తన కదా అంటూ ఇట్టే గుర్తు పట్టేస్తారు.సినిమాల తర్వాత మేధా సుమిత్( Medha Sumith ) అనే సాఫ్ట్ వేర్ ను వివాహం చేసుకున్నారు.

వీరికి ఒక కుమారుడు ఉన్నారు.ప్రస్తుతం మేధా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతుంది.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది మేధా.అప్పటికి ఇప్పటికీ ఆమె ఏ మాత్రం మారకుండా అలాగే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube