Bigg Boss7 : బిగ్ బాస్7 గ్రాండ్ ఫినాలే కి వచ్చే గెస్ట్ ఎవరో తెలుసా.. అస్సలు ఊహించలేరు..?

బిగ్ బాస్ 7 ( Bigg Boss7 ) ఉల్టా పల్టా చివరి వారానికి వచ్చింది.ప్రతి సీజన్లో ఐదుగురు మాత్రమే ఫైనలిస్టులు ఉండేవారు కానీ ఈసారి ఆరుగురు ఫైనలిస్టులు అని చెప్పారు.

 Do You Know Who Will Be The Guest For The Grand Finale Of Bigg Boss 7-TeluguStop.com

ఎందుకంటే ఈసారి అంతా ఉల్టా పల్టా అని ముందే చెప్పుకొచ్చారు.ఇక పల్లవి ప్రశాంత్, శివాజీ( Sivaji ) , యావర్,అమర్దీప్,అర్జున్, ప్రియాంక జైన్ లు ఉన్నారు.

ఇక వీరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది అంటూ వార్తలు వినిపించినప్పటికీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.అయితే ప్రతి ఆది, శనివారాల్లో ఎవరో ఒకరు తమ సినిమాని కి సంబంధించిన ప్రమోషన్ కోసం వస్తూ ఉన్నారు.

ఇప్పటికే హాయ్ నాన్న ప్రమోషన్స్ కోసం నాని, అలాగే రవితేజ, నాగార్జున నా సామిరంగా హీరోయిన్ ఆషికా రంగనాథన్, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, ఎం ఎం కీరవాణి, అనిల్ రావిపూడి, శ్రీలీల( Sreeleela ) , నవీన్ పోలిశెట్టి,సిద్ధార్థ్ ఇలా చాలామంది సెలబ్రిటీలు బిగ్ బాస్ 7 రియాల్టీ షో కి గెస్ట్లుగా వచ్చి తమ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేసుకున్నారు.అయితే ఈసారి బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే లో గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది.

Telugu Amardeep, Balakrishna, Bigg Boss, Biggboss, Mahesh Babu, Nagarjuna, Sivaj

ఇక గ్రాండ్ ఫినాలేకి ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్ గా రావడం బిగ్ బాస్ సీజన్ 1 నుండి వస్తుంది.ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు గ్రాండ్ ఫినాలే కి వచ్చారు.అయితే ఈసారి ఇద్దరు సెలబ్రిటీలు బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలేకి గెస్టులుగా వస్తారని తెలుస్తోంది.అందులో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh babu ) కాగా మరొకరు నందమూరి బాలకృష్ణ అని సమాచారం.

అయితే మహేష్ బాబు తన గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ కోసం వస్తారు కావచ్చు.

Telugu Amardeep, Balakrishna, Bigg Boss, Biggboss, Mahesh Babu, Nagarjuna, Sivaj

కానీ నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ,అక్కినేని నాగార్జునకి మధ్య అంతగా సత్సంబంధాలు లేవని ఇప్పటికే ఎన్నోసార్లు మనం చూసాం.అయితే అలాంటి నాగార్జున హోస్ట్ గా చేసే బిగ్ బాస్ 7 కి బాలకృష్ణ గెస్ట్ గా వస్తారా లేదా అనేది ఇంకో రెండు మూడు రోజులు వెయిట్ చేస్తేనే తెలుస్తుంది.ఇక ఈసారి టైటిల్ రేస్ లో పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) ,శివాజీ, అమర్దీప్ ఈ ముగ్గురి మధ్య పోటీ ఉంది.

అలాగే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube