పూజా హెగ్డే(Pooja Hegde).ఒకప్పుడు స్టార్ నటిగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది.
చేతినిండా అవకాశాలతో తినడానికి టైమ్ కూడా లేకుండా సినిమాలకు డేట్స్ ఇచ్చి బిజీ బిజీ గా ఇండస్ట్రీలో గడిపింది.కానీ ప్రస్తుతం ఆమెకు తెలుగులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా తప్ప మరో ఆఫర్ లేదని తెలుస్తోంది.
అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా ఒకటో రెండో సినిమాలు తప్ప పూజ హెగ్డే చేతులో ఎక్కువ ప్రాజెక్ట్స్ లేవని సమాచారం.ఇక ఈమె చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది.
అంతేకాకుండా కొన్ని వ్యాపార ప్రకటనల్లో అలాగే మరికొన్ని షాప్స్ ఓపెనింగ్ కి వెళ్తూ పూజ హెగ్డే భారీగానే డబ్బులు సంపాదిస్తుంది.
అయితే తాజాగా పూజ హెగ్డే దుబాయ్ (Dubai) లో ఒక క్లబ్ ని ఓపెనింగ్ చేయడం కోసం అక్కడినుండి పిలుపు రాగా అక్కడికి వెళ్లిందట.
అయితే పూజ హెగ్డే క్లబ్ ఓపెనింగ్ కి ( Club Opening ) వెళ్ళిన సమయంలో ఆమెకు చంపేస్తాను అని బెదిరింపులు వచ్చాయట.ఇక అసలు విషయంలోకి వెళ్తే.
ఓ సందర్భంలో పూజ హెగ్డే కి దుబాయ్ లో ఉన్న మరికొందరికి మధ్య ఒక పెద్ద వాదన జరిగిందట.
ఇక వాదనలో ఇరువురు చాలా గట్టిగా వాదించుకోవడంతో పూజ హెగ్డే నీ వాళ్లు చంపేస్తామని బెదిరించారట.దాంతో వెంటనే పూజ హెగ్డే పెట్టే బేడే సర్దుకొని ఇండియాకి తిరుగు ప్రయాణం చేసిందని బాలీవుడ్ సమాచార సంస్థ ఒక పోస్ట్ చేసింది.దాంతో ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.
అయితే పూజ హెగ్డేని చంపుదామని బెదిరించింది ఎవరు.అసలు పూజ హెగ్డే (Pooja Hegde) ఎవరి దగ్గర వాదన చేసింది అని చాలా మంది నెటిజన్స్ ఆరా తీశారు.
అయితే తాజాగా ఈ విషయం గురించి హీరోయిన్ పూజ హెగ్డే టీం (Pooja Hegde Team) క్లారిటీ ఇచ్చింది.పూజ హెగ్డే గురించి వస్తున్న ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.అసలు పూజ హెగ్డేని ఎవరు బెదిరించలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.ఇక వారి క్లారిటీతో పూజ హెగ్డేని దుబాయ్ లో చంపుతామని బెదిరించారు అంటూ వచ్చిన వార్తలకి పులి స్టాప్ పడినట్లు అయింది.