Tanikella Bharani : భరణి గారిని టార్చర్ పెట్టిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..,?

ఒక సినిమా అనేది సూపర్ సక్సెస్ అవ్వాలంటే రైటర్ కి, డైరెక్టర్ కి మధ్య మంచి సంబంధం ఉండాలి.అలాంటప్పుడే సినిమా మంచి సక్సెస్ ను సాధిస్తుంది.

 Do You Know Who Is The Star Director Who Tortured Bharani-TeluguStop.com

అది కనక మిస్ అయినట్టు అయితే సినిమా డిజాస్టర్ గా మారుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ప్రస్తుతం మంచి నటుడిగా కొనసాగుతున్న తనికెళ్ల భరణి( Tanikella Bharani ) ఒకప్పుడు రైటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈయన కెరియర్ స్టార్టింగ్ లో సంచలన దర్శకుడి గా పేరుపొందిన వర్మ( Verma ) చేసిన శివ సినిమాకి డైలాగ్ రైటర్ గా పనిచేశాడు.

 Do You Know Who Is The Star Director Who Tortured Bharani-Tanikella Bharani : �-TeluguStop.com

అయితే వీళ్ళిద్దరి మధ్య అప్పటి మంచి మంచి సంబంధం ఉండేది.ఒకరోజు భరణి గారు ఒక సీన్ కి డైలాగ్స్ రాస్తున్నప్పుడు వర్మ వచ్చి అది అలా కాదు, ఇలా రాయి అని సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశాడట.దాంతో కోపానికి వచ్చిన భరణి నన్ను రాయనిస్తే రానివ్వండి లేదా మీరు రాసుకుంటా అంటే రాసుకోండి అని గట్టిగా అరిచాడట.

దాంతో వర్మ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా కొద్దిసేపు అక్కడే కూర్చొని ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడట.

దాంతో ఆ సీన్ పూర్తయిన తర్వాత వర్మకు ఆ డైలాగ్ వర్షన్ చూపిస్తే ఆ డైలాగ్స్ మొత్తం చదివి, నేను ఎలాగైతే కావాలనుకున్నానో అది కరెక్ట్ గా క్యాచ్ చేసి బాగా రాశావు అని అప్రిషియేట్ చేసారట.అలా ఒక రైటర్ కి ఫ్రీడం ఇస్తే చాలా బాగా రాస్తాడు.అలా కాకుండా అన్ని రిఫరెన్సులు, ఇన్ పుట్ లు ఇస్తే రైటర్ తడబడతాడు కాబట్టి ఎప్పుడైనా రైటర్ తో రాయించుకోవాలంటే రైటర్ ని ఓపెన్ మైండ్ తో ఉండనివ్వాలి అంటూ భరణి ఒకానొక సందర్భంలో తెలియజేయడం విశేషం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube