ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టిడిపి వర్సెస్ వైసిపి పార్టీ అన్నట్లుగా ఉంది.ఇప్పటికే టిడిపి పార్టీతో జనసేన పార్టీ కలిసిపోయి ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడగొట్టాలని చూస్తోంది.
అయితే రాజకీయాల పరంగా ఇలా ఉన్నప్పటికీ ఒకప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ( Balakrishna ) కి పెద్ద వీరాభిమానట.అయితే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy ) అత్యంత సన్నిహితులకు తప్ప చాలా మందికి తెలియదు.
ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి గతంలో రాజకీయాల్లో ఉండగానే కొన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టి అలాగే డిస్ట్రిబ్యూటర్ గా కూడా పనిచేసేవారట.అలా తండ్రి బాటలో జగన్మోహన్ రెడ్డి కూడా అడుగులు వేసి ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు బాలకృష్ణకి డై హార్డ్ ఫ్యాన్ గా మారారట.
అంతేకాదు అప్పట్లో బాలకృష్ణ సినిమా విడుదల అవుతుందంటే చాలు రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణకు సంబంధించిన పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టించే వారట.అయితే అలాంటి సందర్భంలో ఓ రోజు బాలకృష్ణ చేసే సీమ సింహం సినిమాని కొనుగోలు చేద్దామని తండ్రికి చెప్పారట.అయితే రాజశేఖర్ రెడ్డి ( Rajashekhar Reddy ) మాత్రం దీనికి ఒప్పుకోలేదట.
కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టిన పట్టు విడవకుండా ఎలాగైనా సరే సీమ సింహం ( Seema simham ) సినిమాని కొనుగోలు చేశారు.అయితే దురదృష్టం ఏంటంటే ఈ సినిమా మొదటి రోజు నుండే ప్లాఫ్ టాక్ తెచ్చుకొని అతిపెద్ద డిజాస్టర్ అయింది.దాంతో సినిమా అప్పులు తీర్చడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి తమ ఇల్లు కూడా తాకట్టు పెట్టుకున్నారట.
అలా బాలకృష్ణ ( Balakrishna ) పై ఉండే వీరాభిమానంతో జగన్మోహన్ రెడ్డి సినిమాని కొనుగోలు చేసి ఇల్లు తాకట్టు పెట్టుకోవాల్సి వచ్చిందట.ఇక అప్పట్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి కడపలో బాలకృష్ణ అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు.
ఇక ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.