తరచూ ప్రయాణాలు చేసేవారు ఈ వస్తువులు అస్సలు మర్చిపోరట తెలుసా?

ప్రయాణం( Travelling ) అనగానే మనలో కొంతమంది కనీసం రెండు మూడు రోజులనుండి తెగ హడావుడిగా బట్టలు సర్దుకుంటూ వుంటారు.ఇక ఆడవాళ్ళ గురించి చెప్పాల్సిన పనిలేదు.

 Do You Know That Frequent Travelers Never Forget These Things , Latest News, Tra-TeluguStop.com

ప్రతి వస్తువునీ చాలా జాగ్రత్తగా సూటికేసుల్లో పొందుపరుస్తూ వుంటారు.పండగ సెలవులు అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు.

ఆ హడావుడి ఇంకాస్త ఎక్కువ వుంటుంది.ఎందుకంటే ఫ్యామిలీతో సహా తమ తమ సొంత వూళ్ళకు వెళ్తారు కాబట్టి.

బట్టలు సర్దుకోవడం నుండి ఆహారం వంటివి చూసుకోవడం పెద్ద టాస్క్ లాగే ఉంటుంది చాలామందికి.

Telugu Ac Buses, Items, Latest, Smart Watch, Smart Watches, Sunglasses-Latest Ne

ఇక మరికొంతమంది వుంటారు, ఇప్పటికిప్పుడు ప్రయాణమన్నా చకచకా క్షణాల్లో అన్నీ సర్జేసుకుంటారు.ప్రయాణం ముగిసి ఇంటికి చేరేవరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు.దీని వెనుక కారణం ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉన్న వస్తువులు, దుస్తులు మొదలైనవాటిని తెలివిగా ఎంపిక చేసుకోవడమే.

అవును, తరచుగా ప్రయాణాలు చేసేవారు అస్సలు మరచిపోని వస్తువులు గురించి ఇక్కడ తెలుసుకుందాం.ఆయా వస్తువులు పెట్టుకుంటే ప్రయాణాలలో ఎవ్వరూ అసౌకర్యం అనే సమస్యను ఎదుర్కోరు.అవును, అందులో మొదటివి స్నీకర్స్… వీటిని షూస్( Shoes ) అని కూడా అంటారు.స్నీకర్స్ మెత్తగా, సౌకర్యవంతంగా ఉంటే కొత్తప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కువగా తిరిగినా ఎలాంటి ఇబ్బంది అనిపించదు.

కాళ్ల నొప్పులు లాంటి సమస్యలేవీ ఎదురుకావు.

Telugu Ac Buses, Items, Latest, Smart Watch, Smart Watches, Sunglasses-Latest Ne

ఇక ఏసీ బస్సులు, ఏసీ ట్రైన్ కోచ్ లు, విమానాలలో ప్రయాణించేటప్పుడు కాస్త చలి ఎక్కువగా వున్నట్టు అనిపిస్తుంది.అలాంటి సమయాల్లో వెచ్చగా ఉండేందుకు స్వెట్ షర్ట్ ధరించాలి.రాత్రి సమయాల్లో కూడా వాతావరణ మార్పుల వల్ల చలిగా అనిపించే అవకాశం ఉంటుంది.కాబట్టి స్వెట్ షర్ట్ ఒకటి ఖచ్చితంగా వెంట ఉంచుకోవాలి.అదేవిధంగా సూర్యూడి అతినీలలోహిత కిరణాల నుండి తమను తాము రక్షించుకోవడానికి సన్స్కీన్ లోషన్ వెంట ఉంచుకోవాలి.హార్ట్ రేట్, బిపి, వాతావరణ ఉష్ణోగ్రత మొదలైన వాటిని చెక్ చేసుకుంటూ ఉండటానికి ఫిట్ నెస్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్( Smart watch ) ఒకటి వెంట ఉంచుకోవాలి.అలాగే సన్ గ్లాసెస్ తీవ్రమైన సూర్యకిరణాల నుండి కళ్లను రక్షిస్తాయి.

కాబట్టి అవికూడా వెంట తెచ్చుకోవడం ఎంతో ఉత్తమం.చిన్నపాటి మెడిసిన్ కిట్ ఒకటి, ఉంచుకుంటే ఎక్కువ గంటలు ప్రయాణం చేసేటప్పుడు దిండు ఉంటే హాయిగా గమ్యం చేరేవరకు నిద్రపోవచ్చు.

ఎందుకంటే ఏ సమస్య వస్తుందో తెలియదు కాబట్టి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube