మునిసిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన దరిమిలా.బెజవాడ టీడీపీలో వ్యూహాత్మ క పరిణామాలుచోటు చేసుకున్నాయి.
బెజవాడ కార్పొరేషన్‌ను గత ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది.అప్పట్లో కోనేరు శ్రీధర్ మేయర్‌గా కూడా వ్యవహరించారు.
అయితే.ఇప్పుడు టీడీపీ బలంగానే ఉన్నప్ప టికీ.
ఎంపీ కేశినేని నాని వైఖరితో సరిపడని నాయకులు వర్గాలుగా చీలిపోయారు.ఈ క్రమంలో వర్గ పోరు ఎక్కువగానే కనిపిస్తోంది.
ముఖ్యంగా ఎమ్మెల్సీ బుద్దావెంకన్న, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, పశ్చిమ నియోజకవర్గంలో కీలక నా యకుడు నాగుల్ మీరాలు ఒక వర్గంగా ఉన్నారు.తాజాగా ఈ ముగ్గరు నాయకులు బుద్ధా వెంకన్న ఇంట్లో భేటీ అయ్యారు.
విజయవాడలో టీడీపీని ఎలా నడిపించాలనే విషయంపై చర్చించారు.ఎట్టి పరిస్థితి లోనూ మెజారిటీ వార్డులను కైవసం చేసుకునే దిశ గా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.
వీరికి మాజీ మంత్రి దేవినేని ఉమా వర్గం కూడా అండగా నిలవనుంది.అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా వీరితో కలిసే అవకాశం ఉంది.

దీంతో వెంకన్న, రాధా, నాగుల్ మీరా త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.మాస్‌లోను, క్లాస్‌లోనూ వీరికి ఒకింత గుర్తింపు ఉంది.అయితే,, ఎంపీని కాదని వీరు ఏమేరకు విజయం సాధిస్తారు? కీలక సమయంలో గ్రూపు తగాదాలు కొనసాగితే.వైసీపీ బలపడే అవకాశం ఉందన్న విశ్లేషణల నేపథ్యంలో ఎలా ముందుకు సాగుతారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది.ఏదేమైనా.విజయవాడ టీడీపీలో ఈ దఫా గెలుపు అంత సజావు కాదనే అంటున్నారు పరిశీలకులు.మరి ఏం జరుగుతుందో చూడాలి.