ది లయన్ కింగ్ 2019 రీమేక్‌ను ప్రదర్శించినందుకు గాను కాలిఫోర్నియాలోని ఒక ప్రాథమిక పాఠశాల నుంచి పర్మిట్ ఫీజును కోరినందుకు గాను డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ గురువారం క్షమాపణలు కోరారు.తమ కంపెనీ తరపున ఎమర్సన్ ఎలిమెంటరీ స్కూల్ పీటీఏకు క్షమాపణలు చెబుతున్నానని, అలాగే వారి నిధుల సేకరణ కార్యక్రమానికి విరాళం ఇస్తానని ఇగర్ ట్వీట్ చేశారు.
నవంబర్‌లో పేరెంట్-టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిధులు సేకరణ కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకులు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.ఆ సమమంలో టికెట్‌ను 15 డాలర్లకు విక్రయించినట్లుగా తెలుస్తోంది.
అయితే బర్కిలీసైడ్, డిస్నీ లైసెన్సింగ్ ఏజెంట్, మూవీ లైసెన్సింగ్ యూఎస్ఏలు.ఎలాంటి లైసెన్స్ లేకుండా పాఠశాలలో ది లైన్ కింగ్ చిత్రాన్ని ప్రదర్శించారని ఆరోపించారు.
తద్వారా స్కూలు యాజమాన్యం కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని అభ్యంతరం తెలిపారు.

అంతేకాకుండా కాపీ రైట్ చట్టం ప్రకారం.250 డాలర్లను సింగిల్ యూజ్ పర్మిట్ లేకుండా ప్రదర్శించినందకు, మరో 250 డాలర్లను ధియేటర్‌కు వెలుపల ప్రదర్శించినందుకు చెల్లించాలని ఆదేశించింది.అయితే దీనిపై విద్యార్ధుల తల్లీదండ్రులు, పిల్లలు, స్థానికుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
దీంతో దిగి వచ్చిన ఇగెర్ క్షమాపణలు చెప్పాడు.అయితే ట్వీట్‌లో చెప్పినట్లు స్కూల్‌కు ఎంత మొత్తం విరాళం ఇస్తున్నాడో మాత్రం స్పష్టంగా చెప్పలేదు.