బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్( Shahrukh Khan ) హీరోగా నటించిన తాజా చిత్రం జవాన్.( Jawan Movie ) ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ( Director Atlee ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇటీవల సెప్టెంబర్ 7న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డుల మోత మోగించింది.ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా ముంబైలో విజయోత్సవాలు నిర్వహించారు మూవీ మేకర్స్.
ఇందులో నయనతార( Nayanthara ) మినహా చిత్రబృందం పాల్గొన్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ అట్లీ మాట్లాడుతూ.కరోనా విడ్ సమయంలో షారుక్‌కు జవాన్ మూవీ కథ వినిపించాను.అప్పటి పరిస్థితులు చూస్తే అసలు కొన్ని సంవత్సరాల పాటు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా అనిపించింది.అలాంటి పరిస్థితుల్లో నన్ను నమ్మి రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు కూడా నిర్మాతలు ( Producers ) ముందుకు వస్తారో లేదో అనుకున్నాను.ఒక నిర్మాతగా ఆ ఆలోచనలు నాకు తెలుసు.కానీ, ఆ సమయంలో షారుఖ్ నా మీద ఉన్న నమ్మకంతో రూ.300 కోట్లు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సినిమా పూర్తయే సరికి ఆ బడ్జెట్ కూడా దాటిపోయింది.
ఆయన మాత్రం ఎక్కడా రాజీపడలేదు.
ప్రేక్షకులు మాకు బ్లాక్‌బస్టర్‌ను అందించారు.ఈ సినిమా నేను షారుక్‌కు రాసిన ప్రేమలేఖగా భావిస్తాను అని చెప్పుకొచ్చారు అట్లీ.( Atlee ) అనంతరం తన సినిమాలు మంచి సక్సెస్ ను సాధిస్తుండడం విషయం పై స్పందిస్తూ.నేను రచయితలా, దర్శకుడిగా సినిమా తీయను.ఒక అభిమానిగా తెరకెక్కిస్తాను.వ్యక్తికి అభిమానిని కాదు సినిమాకు అభిమానిని.ఒక చిత్రంలో అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి నా దగ్గర ఎలాంటి ఫార్ములాలు లేవు.
ఏది బాగుంటుందనిపిస్తే అది చేస్తాను.నా జీవితంలో నేర్చుకున్న విషయాలనే సినిమాలో చూపిస్తాను.
నాకుటుంబం, నా చుట్టూ ఉండే పరిస్థితుల నుంచి నేను గమనించిన విషయాలను సినిమాగా చిత్రీకరిస్తాను.అదే నా విజయం వెనుక రహస్యం అని అట్లీ వెల్లడించారు.